Suriya : జైభీమ్ లాభాలతో రియల్ లైఫ్ సినతల్లిని ఆదుకున్న హీరో సూర్య

Continues below advertisement

జైభీమ్ లో ఓ గిరిజన మహిళ చేసే పోరాటంలో చంద్రు ఆమెకి సాయం చేస్తారు. నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ప్రపంచానికి పరిచయమయ్యాయి. సినిమాలో గిరిజన మహిళగా సినతల్లి అనే పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు. పార్వతి అమ్మాళ్ అనే మహిళ స్పూర్తితో ఈ పాత్రను రాసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. పిల్లలను పోషించలేక.. వృద్దాప్యంతో కష్టపడుతున్నారు. 'జై భీమ్' సినిమాతో ఆమె గురించి బయటప్రపంచానికి తెలియడంతో.. చాలా మంది సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఆమెకి సొంతిల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. తాజాగా హీరో సూర్య కూడా పార్వతి అమ్మాళ్ ను ఆర్థికంగా ఆదుకున్నారు. ఆమె కుటుంబానికి రూ.10 లక్షల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ చేసి.. ఆ మొత్తంపై నెల నెలా వచ్చే వడ్డీని పార్వతి అమ్మాళ్ కు చేరేలా చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram