Sonu Sood: రూ.20 కోట్ల పన్ను ఎగ్గొట్టిన నటుడు సోనూ సూద్
Continues below advertisement
నటుడు సోనూసూద్‌కు చెందిన ఇల్లు, ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు జరిపారు. ఆయన ఆస్తులపై గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి సమయంలో వేలాది మందిని ఇంటికి చేర్చడానికి తన ఆస్తులు ఖర్చు చేసిన సోనూసూద్ గురించి ఐటీ శాఖ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. నటుడు సోనూసూద్ ఏకంగా రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆదాయపన్ను(ఐటీ) విభాగం అధికారులు శనివారం వెల్లడించారు.
Continues below advertisement