ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీ

Continues below advertisement

NDA జోరుకి కళ్లెం వేసేందుకు ఇండీ కూటమి ఏర్పాటైంది. మొన్నటి ఎన్నికల్లో కొంత వరకూ ప్రభావం చూపించ గలిగింది. కానీ...ఏదో వెలితి. ఓ నాయకత్వం అంటూ లేని కూటమి ఇది. ఈ విషయంలోనే మొదట్లోనే చాలా విభేదాలు వచ్చాయి. నితీశ్ కుమార్ లీడ్‌ తీసుకున్నా..ఆయన ఎవరూ ఊహించని షాక్ ఇచ్చి ఎన్‌డీఏలోకి జంప్ అయ్యారు. ఆ తరవాత వరుస పెట్టి షాక్‌లు తగిలాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా కూటమిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక పెద్ద దిక్కుగా ఉంటారనుకున్న మమతా బెనర్జీ కూడా సైడ్ అయిపోయారు. పైగా కాంగ్రెస్‌పై ఆమె పదేపదే విమర్శలూ చేశారు. మొత్తానికి కూటమిలో చీలికలు వచ్చాయి. ఇప్పుడు ఉందంటే ఉంది. కానీ...ఓ లీడర్ అంటూ ఉంటే...ఆ కూటమికి ఓ బలం వస్తుంది. ఇప్పుడా బలం కోసమే చూస్తున్నారు. ఇండీ కూటమికి నేతృత్వం వహించాలంటూ మమతా బెనర్జీ గురించి మరోసారి ప్రస్తావన వస్తోంది. ఇందుకు కారణం...వైసీపీ ఈ చర్చ పెట్టడం. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ఇండీ కూటమిని లీడ్‌ చేసేందుకు అన్ని అర్హతలున్న లీడర్ అని ప్రశంసించారు. ఆమె నాయకత్వానికి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారో...ఓ సారి క్లారిటీగా విందాం. ఇదీ ఆయన అభిప్రాయం. అంటే...ఇండీ కూటమిలో చేరేందుకు రెడీగానే ఉన్నామని ఇలా డైరెక్ట్‌గానే అనౌన్స్ చేశారు. పైగా...మమతా కూడా ఇండీ కూటమినీ లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాక..పలు పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే...ఈ కూటమిలో చేరేందుకు వైసీపీ కూడా మద్దతు పలకడమే ఆసక్తికరంగా మారింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram