వన్యప్రాణులను హింసిస్తే చూస్తూ ఊరుకోం, కఠిన చర్యలు తప్పవు - కాకినాడ DFO
వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఎస్.భరణి హెచ్చరిస్తున్నారు. అరుదైన ఇండియన్ రాక్ పైథాన్ స్నేక్ తో...ఇటీవల ఓ జాతరలో డ్యాన్స్ చేస్తున్న వారిని గుర్తించినట్టు చెప్పారు. వారి నుంచి పైథాన్ ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. ఇకపై జాతరల్లో కానీ, ఉత్సవాల్లో కానీ పాములతో డ్యాన్స్ లు చేస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన కొరింగ మడ అడవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొంత మంది అడవులను అడ్డం పెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వారిపైనా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అధికారులంతా అప్రమత్తంగా ఉంటున్నారని, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని స్పష్టం చేశాగు. నెమళ్ల సంఖ్య ఎంత ఉందనేది లెక్కించలేదని, ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో నెమళ్లు లేవని చెప్పారు. ABP దేశంతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె మరి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు.