Drugs Free AP: డ్రగ్స్ అనే మాటే వినపడకూడదు : ఏపీ సీఎం వైఎస్ జగన్
Continues below advertisement
డ్రగ్స్ నియంత్రణపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని కాలేజీలు, యూనివర్సిటీల మ్యాపింగ్ తప్పనిసరి అని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం ఉంటే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలన్నారు. డ్రగ్స్‌ను ఎలా నివారించాలో నిర్మాణాత్మక ఆలోచనలతో రావాలని సూచించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ వాడకం నిరోధించాలని, 70-80 శాతం డ్రగ్స్ సరఫరా అడ్డాలుగా కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నాయని సమీక్షలో పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, డ్రగ్స్ ఫ్రీ కాలేజీలు, కళాశాలలు ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు.
Continues below advertisement