AP Aided Controversy : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ?

Continues below advertisement

ఎయిడెడ్ విద్యాసంస్దలపై ఏపి  సిఎం జగన్ నిర్ణయం వివాదస్పందంగా మారింది. ఇన్నాళ్లు ఎయిడెడ్ విద్యాసంస్దల భారం ప్రభుత్వమే భరించేది. తాజాగా జీవో నెంబర్ 35,42, 50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్దలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించంది. దీంతో ఏపిలోని అనేక కళాశాలలో విద్యార్దులు.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఘర్షణకు దారితీస్తున్నాయి. అనంతపురంలో విద్యార్దులపై లాఠీఛార్జి చేయడంతో మరో మారు ఎయిడెడ్ పై సీఎం జగన్ నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్దుల ఆగ్రహానికి కారణాలేంటి..?  ప్రభుత్వం నిధులతో నడుస్తున్న ఎయిడెడ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వచ్చే నష్టమేంటి.? ఒకవేళ ఆస్తులను అప్పగించేందుకు ఎయిడెడ్ విద్యాసంస్దల యాజమాన్యం ఒప్పుకోకపోతే ఎవరికి నష్టం ? ఏపిలో ఎయిడెడ్ రచ్చపై వాస్తవాలేంటి..?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram