Visakha: ఆధార్ కార్డులు ఇప్పించండి.. నెత్తిన ఆకులతో చిన్నారుల వినూత్న నిరసన
Continues below advertisement
విశాఖ జిల్లా జి. మాడుగుల మండలం గడుతూరు పంచాయితీ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. నేడుబంద గ్రామం గిరిజనులు ఆధార్ కార్డుల కోసం నిరసన చేపట్టారు. రెవెన్యూ రికార్డుల్లో తమ గ్రామం పేరు లేదని... అందకని ఎలాంటి ప్రభుత్వ పథకాలు తమకు అందడం లేదని వాపోతున్నారు. చివరకు పిల్లలకు బర్త్‌సర్టిఫికేట్ కూడా అధికారులు ఇవ్వడం లేదంటున్నారు. దీని కారణంగా చిన్నారులకు ఆధార్ రావడం లేదని... బడిలో చేర్పించేందుకు టీచర్స్ అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు రాకపోగా... పిల్లలకు చదువుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయిందంటున్నారు. అందుకే చిన్నారులు కూడా ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఐటీడీఏ అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Continues below advertisement