ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుంది
ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన మద్యం పాలసీతో కొత్త మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో రెండు రోజులుగా మద్యం షాపులు మందు బాబులతో కిట కిట లాడుతున్నాయి. నాణ్యమైన మద్యంతో పాటు తక్కువ రెట్లకే మద్యం ఇస్తాం అని ప్రకటించిన ప్రభుత్వం రేట్లు తగ్గించి మంచి నాణ్యమైన మద్యం విక్రయించేలా చర్యలు తీసుకున్నామని ప్రకటించింది... దీనిపై మందు బాబులు ఏం చెబుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేసింది abp దేశం.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో మద్యం షాపుల వద్ద మందు బాబులు ఏం చెబుతున్నారో మీరే చూసేయండి మరి..
లిక్కర్ ధరలపై మందు బాబుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పలువురు మందు బాబులు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ధరను తగ్గించిందని చెబుతుండగా.. ఇంకొందరు మాత్రం తేడా ఏం లేదని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వ హాయాంలో దొరికిన లిక్కర్ కారణంగా ఆరోగ్యం కూడా పాడు కాలేదని ఓ వ్యక్తి స్పందించారు. క్వార్టర్ ధరలు తగ్గించిన ప్రభుత్వానికి మరో మందుబాబు ధన్యవాదాలు తెలిపారు.