Tirumala: తిరుమల ప్రసాదం ఇచ్చేందుకు డీఆర్‌డీవో సంచులు.. సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన టీటీడీ..
Continues below advertisement
పర్యావరణ పరిరక్షణ, ప్రాణకోటి మనుగడకు హాని కలిగించని విధంగా డిఆర్‌డిఓ తయారు చేసిన బయో డిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని డిఆర్డిఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్యాయంగా బయో డిగ్రేడబుల్ సంచులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రంలోని అడ్వాన్స్ సిస్టమ్స్ లేబొరేటరీ అనేక రకాల ప్రయోగాలు చేసి ఈ సంచులు తయారు చేసిందని చెప్పారు సతీష్ రెడ్డి. పర్యావరణానికి తీవ్ర విఘాతం, పశువులకు ప్రాణ హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయో డిగ్రేడబుల్ కవర్ల తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. మొక్కజొన్న వ్యర్థాలతో సంచులు తయారుచేసి, వీటి వల్ల పర్యావరణానికి ఎలాంటి మేలు కలుగుతుందని పరిశోధనలు చేసిందన్నారు.
Continues below advertisement