ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు దాటుతున్న గిరిజన విద్యార్థులు.
Continues below advertisement
విశాఖ జికె వీధి, గూడెం కొత్త వీధి మండలం, బందాపాలెం గ్రామ చిన్నారులు స్కూల్ కు వెళ్లి చదువుకోవాలంటే, ప్రమాదకరంగా ఉన్న వంతెనపై నడిచి , వాగులు దాటి , మైళ్ళ కొద్దీ నడుస్తున్నారు. ఆ చిట్టి చిట్టి పాదాలు అంతంత దూరం నడుస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని , వాగు దాటడం ప్రమాదకరం గా ఉంటుందని , తల్లితండ్రులు బిక్కుబిక్కుమంటున్నారు. పనశలపాడు గ్రామంలో ప్రభుత్వం స్కూల్ బెల్డింగ్ ఇవ్వకపోయినా , గ్రామస్తులంతా కలిసి పిల్లలు చదువుకోటం కోసం ఒక చిన్న రేకుల షెడ్ వేశారు. మారుమూల ప్రాంతాలలో రహదారి, విద్యుత్, గెడ్డవాగులు పై వంతెన్లు లేక ఆదివాసి గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.
Continues below advertisement