Ratnam Pens: స్వదేశీ ఉద్యమస్ఫూర్తిని చాటిచెప్పిన కేవీ రత్నం ఫ్యామిలీ
Continues below advertisement
స్వదేశీ ఉద్యమస్ఫూర్తిని చాటిచెప్పిన కేవీ రత్నం (కోసూరి వెంకటరత్నం) 1932లో రాజమండ్రిలో రత్నంపెన్స్ ను ప్రారంభించారు. రత్నం పెన్స్ 1935 జులై 18న మహాత్మాగాంధీ ప్రశంసలు పొందింది. దేశంలో తొలి స్వదేశీ పెన్ గా రత్నం పెన్స్ రికార్డులు తిరగరాసింది. పలువురు ప్రధానులు, రాష్ట్రపతులు రత్నం పెన్ వినియోగదారులుగా ఉన్నారు. కాగా, రత్నం పెన్స్ అధినేత కేవీ రమణమూర్తి తుదిశ్వాస విడిచారు. రమణమూర్తికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. అనారోగ్యంతో రాజమహేంద్రవరంలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. తండ్రి కేవీ రత్నం మరణానంతరం రత్నం పెన్స్‌ను సమర్థవంతంగా నడిపించారు రమణమూర్తి.
Continues below advertisement
Tags :
Ratnam Pens KV Ratnam KV Ramana Murthy Rajamundry Pens Ratnam Pens News Ramana Murthy Passed Away