ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బంది

Continues below advertisement

విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు నిపుణులు ఎంతగానో శ్రమిస్తున్నారు. పది మందితో కూడిన డైవింగ్ టీమ్ నదిలోకి దిగి పడవలను ముక్కలుగా ముక్కలుగా చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బోట్లు చాలా దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి కొంతమేర మాత్రమే కట్ చేయగలిగారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తొలుత బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు.భారీ సైజులో ఉన్న ఈ బోట్లను తొలగించేందుకు నిపుణులతో కూడిన టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు పది మంది వరకు ఉన్న డైవింగ్ టీమ్ నదిలోకి దిగి పడవలను ముక్కలుగా చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఈ భారీ పడవలను యథాతథంగా తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇది సాధ్యపడనందునే ముక్కలుగా బోట్లను కోసి తీయాలని నిర్ణయించారు. కానీ ఆ బోట్లు చాలా దృఢంగా ఉండటంతో ఉదయం నుంచి చాలా తక్కువ భాగాన్ని మాత్రమే కట్ చేయగలిగారు. ఈ కారణంగా బోట్ కటింగ్ ప్రక్రియ మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. మొదటగా ఈ బోట్లను క్రేన్ ద్వారా లిఫ్ట్ చేయాలని ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram