Nellore: నెల్లూరులోని కుక్కలగుంటలో అగ్ని ప్రమాదం
Continues below advertisement
నెల్లూరు నగరంలోని కుక్కలగుంట ప్రాంతంలో ప్రమాదవశాత్తు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంట్లో ఏ ఒక్క సామాను కూడా పనికిరాకుండా పోయింది. మొత్తం అగ్నికి ఆహుతైంది. కుటుంబ సభ్యులు బంగారం, ఇతర విలువైన వస్తువులకోసం వెదుక్కోవడం చూపరులను కంటతడి పెట్టించింది. దాదాపు రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని బాధితులు చెబుతున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Continues below advertisement