Dasara Festival 2021: రూ.5 కోట్ల కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి అలంకరణ
దేవీ నవరాత్రుల సమయంలో దేవతలకు కరెన్సీ నోట్లతో దండలు వేయడం చూస్తూ ఉంటాం. అయితే నెల్లూరులో ఏకంగా రూ.5 కోట్ల 16 లక్షలు విలువ చేసే కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ప్రత్యేక అలంకారం చేశారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ధనలక్ష్మీ అలంకారం సందర్భంగా ఈ ప్రత్యేక అలంకరణ చేశారు.
7 కేజీల బంగారం, 60 కేజీల వెండితో అలంకరణ
100 మందికి పైగా వాలంటీర్లు శ్రమించి కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. 2 వేల రూపాయలు, 500 రూపాయలు, 200, 100, 50, 10 రూపాయలు నోట్లను అలంకరణ కోసం ఉపయోగించారు. కరెన్సీ నోట్ల అలంకరణ చూసేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. పురాతన చరిత్ర ఉన్న కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నాలుగేళ్ల క్రితం రూ.11 కోట్లతో పునర్నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాలను ఘనంగా చేస్తున్నారు. నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 7 కేజీల బంగారం, 60 కేజీల వెండితో అమ్మవారిని అలంరకిస్తున్నామని చెప్పారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి