Large Whale On Srikakulam Shores: శ్రీకాకుళం జిల్లాలో తీరానికి భారీ తిమింగలం
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో పాత మేఘవరం, డి.మరువాడ మధ్య సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. ఇది అప్పటికే చనిపోయింది. ఇది సుమారు 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఈ చేపలు చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని చోట చేరడం వల్ల చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. అత్యంత అరుదైన జాతికి చెందిన తిమింగలం ఇదని చెప్తున్నారు. అయితే... ఇంత భారీగా ఉన్నప్పటికీ కూడా ఇది కేవలం ఆ తిమింగలం జాతి పిల్ల అయి ఉంటుందని కూడా అంటున్నారు.
Continues below advertisement