Kondabaridi dalam Present Situation | విప్లవ ఉద్యమాల పురిటిగడ్డ...ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు అడ్డా

Continues below advertisement

నక్జల్ బరి ఉద్యమం అంటే సీక్కోలు పురిటి గడ్డ అంటు చరిత్ర చెబుతుంది. అదికూడ ఇద్దరు మాష్టార్లుతో పుట్టింది. ఆరు దశాబ్దాల క్రితం అన్నింటా దోపిడీకి గురవుతున్న గిరిజన ప్రజలను చైతన్యపరచి వారి సహకారం, ప్రోత్సాహంతో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టిన నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం లపేర్లు ముందుంటాయి. వారెవరు ఎక్కడి వారు అనేది పరిశీలిస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  ఓ మారుమూల ప్రాంతమైన గిరిజన గ్రామం. అదేక్కడంటే ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా  కురుపాం మండలం కొండబారిడి గ్రామంలో 1962-63 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేసిన వెంపటాపు సత్యం నాటి గిరిజనుల అమాయకత్వం, అన్నింటా దోపిడీకి గురవడంపై చలించి పోయాడు. అప్పట్లో ఉద్యమానికి బీజం వేసీవారిలో చైతన్యానికి నాంది పలికారు. ఈ రోజు ఆప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా గిరిపుత్రులు కూడ ఉద్యోగాలను పొంది నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.వెంపటాపు సత్యం మాష్టారంటే ఈ తరం వారు గుండేల్లో నిలిచే వ్యక్తి ..ఆ రోజుల్లో   అమాయక గిరిపుత్రులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి ఒకగాడిలో పెట్టి వారి బతుకుల మార్చడంలో దిక్సూచీగా నిలిచారని నక్జల్ బరి ఉద్యమంలోనే కాకుండా చరిత్ర చెబుతుంది.

 

  పగలు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, ఖాళీ సమయాల్లో రాత్రి పూట గిరిజన గ్రామాల్లో తిరుగుతూ వారిని సంఘటిత పరుస్తూ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ పంథాలో నడిపాడు. ఆ సమయంలో వీరఘట్టం ప్రాంతానికి చెందిన ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, పాణిగ్రహి తదితర ఒకే భావజాలం గల పలువురు నాయకులు ఒక్కటవడం, వీరందరూ కమ్యూనిస్టు పార్టీ గొడుగు కింద సమష్టి నిర్ణయాలతో పోరటాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్లారు. గిరిజన ప్రజలను దోచుకొనే వ్యాపారులు, సొండీలు, ఇతర భూస్వాములను హత్యలు చేయడం, వీరి ఇళ్లను దోపిడీ చేసి పేద గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం, భూ పోరాటాలు చేయడం తప్పని సరిస్థితులలో ప్రారంభించారు. 1967 అక్టోబరు 31న మొండెంఖల్లు గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలకు మద్దతుగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు  వేలాదిగా గిరిజన ప్రజలు సభకు తరలివస్తుండగా ఆ సమయంలో గుమ్మ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భూస్వాములు ఈ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా లేవిడి గ్రామం వద్ద దారికాచి సభకు వెళుతున్న గిరిజనుల్లో కోరన్న, మంగన్న లను హాత్య చేశారు. దీంతో గిరిజన ప్రజలు కసి పెంచుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది.  నాటి ప్రభుత్వం పోలీసు బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. ఆతరానికి చెందిన వారిలో చౌదరి తేజేశ్వరరావు ఒక్కరే ఉన్నారు.  కాగా  భూస్వాములు హత్యలు, పోలీసు, సీఆర్పీఎఫ్ గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో నక్సల్బరీ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ రెండు ఉద్యమాలకు భావసారూప్యత గల కారణాలుగా ఆ నాటి నక్సలైట్ పార్టీ జాతీయ నాయకులు చారూ మజుందార్, కానూసన్యాల్, నాగభూషణ్ పట్నాయిక్ తదితర నాయకులు ఉద్యమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించారు. చివరకు 1970, జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు కురుపాం సమీపంలోని కొండల్లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎన్‌కౌంటరు చేశారు. ఆ తరువాత పలువురు నాయకులను అరెస్టులు చేయడంతో నాటి ఉద్యమం బలహీనపడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram