Doctor Saves Boy Life With CPR In Vijayawada | నడిరోడ్డుపై బాలుడికి సీపీఆర్ చేసిన బతికించిన డాక్టర్

Continues below advertisement

Doctor Saves Boy Life With CPR In Vijayawada | వైద్యో నారాయణ హరి'.. అంటే వైద్యులు దేవునితో సమానం అంటారు. నిజంగా ఈ బాలుడి విషయంలో అదే జరిగింది. విజయవాడ అయ్యప్పనగర్ కు చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల 5వ తేదీన సాయంత్రం విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు వెంటనే పిల్లాడిని భుజంపై ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి వీరిని గమనించి వెంటనే విషయం తెలుసుకని... నడిరోడ్డుపై బాలుడుని పడుకోబెట్టి పరీక్షించింది.  అనంతరం అక్కడే బాలుడికి సీపీఆర్ చేసింది. పక్కనే మరోవ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించింది. ఇలా..7 నిమిషాలు చేయగా బాలుడిలో కదలిక వచ్చింది. దీంతో హుటాహుటినా బాలుడిని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో సీపీఆర్ చేయడం వల్లే ఆ బాలుడు బతికాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చూడండి.. ఆ బాలుడి కల్మషం లేని నవ్వును ఈ రోజు మనం చూస్తున్నాం అంటే దానికి కారణం.. ఈ డాక్టరమ్మే. నిజంగా మీరు గ్రేట్ డాక్టరమ్మ..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram