Deputy CM Pawan Kalyan Portfolis | Ministry of Panchayati Raj | సినిమా టికెట్ల ధరలు ఇక పవన్ చేతిలోనే
ఏపీలో నూతన ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు కీలక మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు జనసేనాని చూసుకోనున్నారు. ఐతే.. ఈ శాఖల ప్రాముఖ్యత ఏంటీ..? ఇందులో పవర్ ఉందా..? ఈ శాఖలనే తీసుకోవడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం..!
డిప్యూటీ సీఎం అంటే.. మంత్రులందరిలో కెల్లా ప్రథముడు అనుకోవచ్చు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తన తో సమానమని చంద్రబాబు కూడా పదే పదే చెబుతూ వస్తున్నారు. శాఖల పరంగా కూడా అత్యంత కీలక శాఖలను కేటాయించారు. మామూలుగా హోంశాఖ నిర్వహించేవారు ముఖ్యమంత్రి తర్వాత రెండో స్థానంలో ఉంటారని అనుకుంటారు. కానీ మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత కు హోంశాఖ కేటాయించారు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు చేతిలోనే ఉంది. పవన్ కల్యాణ్‌కు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. ఇవ్నీ అత్యంత కీలకమైనశాఖలే. అందుకే పవన్ ప్రాధాన్యం చంద్రబాబు తర్వాత స్థానంలో ఉంటుంది.