తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న బీజేపి అద్యక్షుడు కామెంట్స్
ఎపీలో బీజేపి అద్యక్షుడు సొము వీర్రాజు చేసిన క్వార్టర్ మద్యం దర పై రాజకీయ దుమారం చెలరేగుతుంది..సోషల్ మీడియాతో పాటుగా రాజకీయాల్లో కూడ ఈ వ్యవహరం తీవ్ర చర్చకు దారితీస్తోంది.అంతే కాదు బీజేపి లో అంతర్గతంగా కూడ సొము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పై వివాదం నెలకొంది.సొంత పార్టి నేతలకు కూడ వీర్రాజు వివరణ ఇస్తున్నారు.తాను చేసిన వ్యాఖ్యలను సమర్దించుకుంటూనే,ఎందుకు అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందో అనే విషయం పై కూడ వీర్రాజు క్లారిటి ఇస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో అయితే ఎపీ ప్రత్యేక,హోదా,స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ,వంటి అంశాలను జోడిస్తూ క్వార్టర్ చీప్ మద్యం 70రూపాయలకే అంటూ వ్యంగంగా పోస్టులు పెడుతున్నారు.అటు టీఆర్ఎస్ నుండి ఆ పార్టి నేత కేటీఆర్ కూడ సొము వీర్రాజు కామెంట్స్ పై ట్విట్ చేశారు...దీంతో ఈ కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి.