Badvel By-Election: బద్వేల్ ఉపఎన్నికల ప్రచారంలో BJP నేత పురందేశ్వరి

Continues below advertisement

రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి కేంద్ర నిధులు ఇస్తుందని, కానీ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సైతం దారి మళ్లిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు పురందేశ్వరి ఆరోపించారు. కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమె మాట్లాడుతూ.. పులివెందుల అభివృద్ధి బద్వేల్ లో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, అక్రమాలే తప్ప అభివృద్ధి శూన్యమని, బెదిరింపులు, భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ వైఎస్సార్ సీపీ చూస్తుందని మండిపడ్డారు. ఎంత మందిని బెదిరింపులకు గురి చేసి లోబర్చుకున్నా అదిరేది లేదు బెదిరేది లేదని పురందేశ్వరి అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram