Kodali Nani and Perni Nani at gym: కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయంలో అధునాతన జిమ్ ఏర్పాటు | ABP Desam

Continues below advertisement

ఉదయం లేచింది మొదలు విశ్రమించేంత వరకు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తూ, శారీరక ఆరోగ్యం పై సిబ్బంది సరిగా దృష్టి కేంద్రీకరించ లేకపోతున్న పోలీసుల కోసం కృష్ణాజిల్లా పోలీసులే ఓ జిమ్ ను ప్రారంభించారు. సిబ్బందిలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఈ ఏర్పాట్లు చేశారు. ఆధునాతన మెషినరీతో సిబ్బంది సంక్షేమం లో భాగంగా ఏర్పాటు చేసిన పోలీస్ వెల్ఫేర్ జిమ్ ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని లాంఛనంగా ప్రారంభించారు. పోలీసులు క్రమంగా తప్పకుండా వ్యాయామం చేస్తూ జిమ్ ను వినియోగించుకోవాలని మంత్రులు కోరారు. నిరంతరం పెరుగుతున్న శాంతిభద్రతల సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు, వివిధ రకాల సమస్యలతో తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వ్యాయామం చేయటానికి వీలుగా సువిశాల ప్రాంగణంలో భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన జిమ్ సిబ్బందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని, పోలీస్ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులు కూడా దీనిని ఉపయోగించు కునేందుకు వీలుగా సమయాలు కేటాయించి ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్ని నాని తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram