టీవీ ఛానల్స్‌లో వచ్చే లైవ్ కార్యక్రమాల్లో ఒక్కోసారి ఊహించని పరిణామాలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా డిబేట్ల సమయంలో ప్యానెల్లో కూర్చొన్న వ్యక్తులు తిట్టుకోవడం, ఒక్కసారి కొట్టుకోవడం కూడా చూసే ఉంటాం. అయితే తాజాగా ఓ సీరియస్ లైవ్ షోలో యాంకర్‌కు తన లవ్ ప్రపోజ్ చేశాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది.
ఇదీ కథ
మేరీ లీ.. సీబీఎస్ అనే అమెరికా న్యూస్ ఛానల్‌లో వాతావరణ వార్తలు చదివే యాంకర్. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డేకి ఆమె వార్తలు చదువుతున్నారు. అయితే తన బాయ్ ఫ్రెండ్ అప్పటికే ఆమె కోసం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు.
మేరీ లైవ్‌లో ఉన్న సమయంలో తన బాయ్ ఫ్రెండ్ కూతుళ్లు ఇద్దరూ రోజా పువ్వులు పట్టుకుని ఆమె దగ్గరు వెళ్లారు. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ అజిత్ నినాన్ కూడా లైవ్‌లోకి వచ్చాడు. ఇది చూసిన మేరీ లీ.. ఫ్యామిలీ విజిట్ అనుకుంది. కానీ అనూహ్యంగా అజిత్.. మోకాళ్లపై కూర్చొని ఉంగరాన్ని బయటకు తీసి.. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు.
ఇలా అజిత్ అడిగేసరికి.. మేరీ నోట మాట రాలేదు. భావోద్వేగానికి గురై కళ్లలోంచి నీళ్లు వచ్చేశాయి. ఆమెకు కూడా అజిత్ అంటే చాలా ఇష్టం. దీంతో అజిత్‌కు ఓ టైట్ హగ్ ఇచ్చి.. ఓ ఇంగ్లీష్ కిస్ ఇచ్చేసి 'లవ్‌యూ టూ' చెప్పేసింది మేరీ. అజిత్ ఆ రింగ్‌ను మేరీకి వేలుకు తొడిగాడు.
అందరికీ తెలుసు
మేరీ ఆఫీస్ సిబ్బంది కూడా ఈ ప్రపోజల్ జరగడానికి సాయం చేశారు. ఈ విషయాన్ని మేరీ ఆనందంగా చెప్పారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Flax Seeds: సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే అవిసె గింజలు, రోజూ గుప్పెడు తిన్నా చాలు
Also Read: UP Election 2022: భాజపాను మళ్లీ గెలిపిస్తే మీ భూములు కూడా అమ్మేస్తారు: అఖిలేశ్