పెళ్లయ్యాక పిల్లల కోసం ఎదురుచూస్తుంటారు కొత్త జంటలు. వారిలో కొంతమందికి గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేకపోయినా త్వరగా గర్భం ధరించరు. అలాంటివారు సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని పెంచే ఆహారం తినడం చాలా అవసరం. హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా గర్భం రావడం ఆలస్యమవుతుంది. అవిసె గింజలను వేయించుకుని రోజూ గుప్పెడు తింటే చాలా మంచిది. వాటితో చేసుకునే వంటలు కూడా చాలా ఉన్నాయి. వాటిని చేసుకుని తిన్నా మంచిదే. 


అవిసెగింజల్లో అద్భుతమైన ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి హార్లోన్లను సమతుల్యం చేయడానికి, శక్తి ఉత్పత్తికి సాయపడుతుంది. అవిసె గింజల్లో ఉండే నూనె పేగులకు సాంత్వన కలిగిస్తుంది. జీర్ణక్రియకు,పోషకాల శోషణకు తోడ్పడుతుంది. మీరు తిన్న ఆహారంలో పోషకాలన్నీ రక్తంలో కలిసేట్టు చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పెద్ద పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 


స్త్రీలు తరచూ అవిసెగింజలు తినడం వల్ల అండాశయంలో రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. అలాగే పురుషులు తింటే వృషణాలలో రక్తం చురుకుగా ప్రవహిస్తుంది. ఇద్దరిలోనూ సంతానోత్సత్తి సామర్ధ్యం పెరుగుతుంది. అయితే అధికంగా ఆడవారి ఆరోగ్యానికే ఇవి అవసరం. అండోత్సర్గము (ఒవులేషన్)ను ప్రోత్సహిస్తాయి. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎలాంటి గుండె సంబంద వ్యాధుల ప్రమాదం రాకుండా అడ్డుకుంటాయి. 


 హెచ్చరిక
గర్భం ధరించకముందే అవిసెగింజలు లేదు అవిసెగింజ నూనెను ఆహారం రూపంలో తీసుకోవచ్చు. ఓసారి గర్భం వచ్చినట్టు తేలాక వాటిని దూరం పెట్టడం మంచిది. వీటి వల్ల గర్భవిచ్చిత్తి అయ్యే అవకాశం ఉందని చెబుతారు. 


అవిసె గింజలు తినాలనిపించపోతే వాటితో  కొన్ని రకాల వంటలు చేసుకుని తినవచ్చు. అవిసె గింజల లడ్డూ, అవిసె మొలకలు, అవిసె డ్రింక్, మునగాకు అవిసె గింజల పొడి లాంటివి చేసుకోవచ్చు. అవిసె గింజల్ని రాత్రి నానబెడితే ఉదయానికి మొలకలు వస్తాయి. వాటిని తింటే చాలా మంచిది. అలాగే అవిసెగింజల్ని నీటిలో నానబెట్టి, ఆ నీళ్లను వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: విటమిన్ ట్యాబ్లెట్లు మింగుతున్నారా? అవి అకాలమరణాన్ని ఆపలేవంటున్న కొత్త అధ్యయనం


Also read: ఈ ఆహారాలకు ఎక్స్‌పైరీ డేటే లేదు, ఎన్నాళ్లయినా వాడుకోవచ్చు