మలయాళీ ముద్దుగుమ్మ అనుపమకు తెలుగులో అభిమానులు ఎక్కువే. ప్రేమమ్  సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ... ఇక్కడ చేతినిండా సినిమాలతో సెటిలైపోయింది. అఆ, శతమానం భవతి వంటి హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. ప్రేక్షకుల మనుసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బటర్ ఫ్లై’.   ఫిబ్రవరి 18న అనుపమా పరమేశ్వరన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ సినిమాలోని ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.చేతులు కట్టుకుని నిలబడిన హీరోయిన్ వెనుకాల విచ్చుకున్న రంగుల రెక్కలు కనిపిస్తున్నాయి. యువతకు, కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుందని చెబుతున్నారు మూవీ మేకర్స్. 


ఈ సినిమాను జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. గంటా స‌తీష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ర‌వి ప్ర‌కాష్ బోడ‌పాటి, ప్ర‌సాద్ తిరువ‌ళ్లూరి, ప్ర‌దీప్ న‌ల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది. 


అనుపమాది కేరళలోని  త్రిస్సూర్ జిల్లాలో ఇరింజలకుడలో జన్మించింది. సినిమా అవకాశాలు రావడంతో చదువును మధ్యలోనే ఆపేసింది.తొలిసారి మలయాళ సినిమా ‘ప్రేమమ్’ లో నటించింది. ఆ సినిమా తెలుగులోకి కూడా రీమేక్ చేశారు. అందులో కూడా అనుపమా నటించింది.ఆమె పాత్ర, నటన నచ్చడంతో తెలుగు సినిమా అవకాశాలు వరుసపెట్టి వచ్చాయి.