టాలీవుడ్ సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కోట్ల బిజినెస్ జరుగుతుంటుంది. చాలా మంది యంగ్ హీరోలకు బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పడడానికి ఈ డబ్బింగ్ సినిమాలు హెల్ప్ చేశాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాను బాలీవుడ్ లో థియేటర్లలో విడుదల చేశారు. అక్కడ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు చాలా మంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను కూడా హిందీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
ఈ క్రమంలో రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమాను నార్త్ లో రిలీజ్ చేశారు. ఇది రవితేజకి హిందీ డెబ్యూ అని చెప్పొచ్చు. నిజానికి ఆయన సినిమాలకు హిందీ డబ్బింగ్ రైట్స్ తోనే పాతిక కోట్ల వరకు వస్తాయి. 'ఖిలాడి' సినిమాను పెన్ స్టూడియోస్ సంస్థ దాదాపు రూ.20 కోట్లు పెట్టి హిందీ థియేట్రికల్ రైట్స్ ను దక్కించుకుంది. అయితే ఈ సినిమాను చూడడానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు.
'ఖిలాడి' హిందీ మార్కెట్ లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే.. వాటి వలన పోస్టర్ ఖర్చులు కూడా రావని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సరైన ప్రమోషన్స్ లేకపోవడం కూడా దానికి కారణమని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ సినిమాకి కలెక్షన్స్ నిల్. ఇకనైనా.. నార్త్ లో సినిమాలను రిలీజ్ చేసేప్పుడు దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి..!
తెలుగులో కూడా 'ఖిలాడి' పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కొన్ని స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు తప్ప సినిమాలో చెప్పుకోవడానికి మరో ఎలిమెంట్ లేదు. ఇప్పటికే చాలా థియేటర్లలో సినిమాను తీసేశారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. రమేష్ వర్మ దర్శకుడు.