UP Election 2022: భాజపాను మళ్లీ గెలిపిస్తే మీ భూములు కూడా అమ్మేస్తారు: అఖిలేశ్

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 18 Feb 2022 04:01 PM (IST)

భాజపాకు మళ్లీ అధికారం ఇస్తే రైతుల భూములు కూడా అమ్మేస్తారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.

అఖిలేశ్ యాదవ్

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మూడు నల్ల సాగు చట్టాలతో 750 మంది రైతుల చావులకు భాజపా కారణమైందని అఖిలేశ్ అన్నారు. మరోసారి వారికి అధికారం ఇస్తే రైతుల భూములు అమ్మేస్తారని విమర్శించారు.

Continues below advertisement



మూడు నల్ల చట్టాలను అమలు చేసి 750 మంది రైతులను భాజపా చంపేసింది. మరోసారి భాజపా అధికారంలోకి వస్తే ఇలాంటి చట్టాలు తెచ్చి మీ (రైతులు) భూములను అమ్మేస్తారు. సాగు చట్టాలను రద్దు చేసినంత మాత్రాన రైతులు మిమ్మల్ని క్షమించరు.                                                           -   అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత


మహిళలకు రక్షణ లేదు


ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అఖిలేశ్ అన్నారు. 



2 రోజుల క్రితం ఓ బాలిక కనపడకుండా పోయింది. ఈరోజు మృతదేహం లభ్యమైంది. దీనికి ఎవరు బాధ్యులు? బాబా ముఖ్యమంత్రే దీనికి బాధ్యుడు. ప్రస్తుతం మహిళలకు అంత శ్రేయస్కరం కానీ ప్రాంతంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నిలిచిందని డేటా చెబుతోంది.                                                          -   అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత


403 స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 7 విడతల్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న 58 స్థానాలకు తొలి విడత ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 14న 55 అసెంబ్లీ స్థానాలకు రెండో విడత పోలింగ్ జరిగింది.  ఫిబ్రవరి 20న 59 స్థానాలకు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం భాజపా, సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని యోగి యోచిస్తున్నారు. మరోవైపు తిరిగి అధికార పట్టాలు ఎక్కాలని సమాజ్‌వాదీ ప్రయత్నిస్తోంది.



 

Published at: 18 Feb 2022 03:54 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.