కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన ట్విటర్ ద్వారా నెటిజన్లతో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ అదేంటంటే... ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఠాకూర్ తనదైన శైలిలో స్టేజ్ పై స్కిప్పింగ్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 


Also Read: ఈ దంపతులు ఇంటికి తాళం వేయరు... చిప్‌తోనే ఇంటికి లాక్, అన్ లాక్






ఇండియా టుడే కాన్‌క్లేవ్ - 2021 కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన స్కిప్పింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈయన ఫిట్‌నెస్ పై ఎక్కువగా శ్రద్ధ వహిస్తారన్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ...‘భారత దేశం క్రీడలకు నిలయంగా మారుతుంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీయాలంటే ఇంకా ఎన్నో పోటీలు నిర్వహించాలి. క్రీడాకారులను ప్రోత్సహించి వారికి సహకరించాలి’అని అన్నారు. 


Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి






జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ‘ఫిట్ ఇండియా’ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ అనురాగ్ ఠాకూర్ స్కిప్పింగ్ చేసి అలరించిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను ఠాకూర్ ప్రత్యేకంగా సన్నానించిన సంగతి తెలిసిందే.


Also Read: 25వేల బిస్కెట్లు... 24 అడుగుల మస్కట్... తయారు చేయడానికి 15 గంటల సమయం


Also Read: లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభ లో కిందపడ్డ అచ్చన్న


Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి