మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత దూరం నడవాలి, రోజుకి ఎన్ని అడుగులు వేయాలి అని చాలా మందికి సందేహం. నడక.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు పదే పదే చెప్తున్నారు. ఇక ఎందుకు ఆలస్యం. రోజుకి ఎన్ని అడుగులు వేయాలి తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


ఫిట్‌గా ఉండడానికి, సమస్యలు లేకుండా ఉండడానికి ఎన్ని అడుగులు వేయాలి అన్న దానిపై పరిశోధనలు చేయగా... 7 వేల నుంచి 10 వేల అడుగులు వరకు రోజూ నడిస్తే మంచిదని నిపుణులు వెల్లడించారు. 


Also Read: కాఫీ, టీలు తాగే ముందు మంచి నీళ్లు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?


టెక్సాస్ విశ్వవిద్యాలయం చేసిన ఓ అధ్యయనం ప్రకారం... చురుకైన వ్యక్తులు 5,000 అడుగులు లేదా అంతకంటే తక్కువ వేసినప్పుడు వారిలో మరుసటి రోజు జీవక్రియలు సక్రమంగా జరుగడం లేదట. అందుకని రోజుకు 5,000 అడుగులకు తక్కువ కాకుండా వేయడం అత్యవసరం. గుండె వ్యాధులు, స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలను నడక ద్వారా మనదరి చేరకుండా చూసుకోవచ్చు.


నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. దీంతో ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. 


నిత్యం వాకింగ్ చేయడం వ‌ల్ల డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌చ్చి హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. నడక వల్ల గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం 31 శాతం వరకు తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.


Also Read: ఏసీల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే ఎంత నష్టమో తెలుసుకోండి


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి