దసరా సమయంలో గార్భా డ్యాన్స్‌కి ఉండే ప్రత్యేకతే వేరు. ఈ డ్యాన్స్ పుట్టింది గుజరాత్‌లో అయినా దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. నవరాత్రుల సమయంలో గార్భా డ్యాన్స్‌తో మహిళలు, చిన్నారులు చేసే సందడి అంతా ఇంతా కాదు. 


Also Read: తొమ్మిది రంగుల నవరాత్రి... ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి... ఆ రంగు ప్రత్యేకత ఏంటి?


కరోనా కారణంగా ఇంతకుముందు చేసుకున్నంత ఘనంగా దసరా నవరాత్రులు చేసుకోలేకపోతున్నాం. గుజరాత్‌లో కూడా దీనిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ అపార్టుమెంట్లలో, సొసైటీల్లో నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. దీంతో అక్కడ సంబరాలు బాగానే జరుగుతున్నాయి. 400 మంది వరకు ఒక చోట దసరా వేడుకలు జరుపుకోవచ్చని చెప్పింది.  






గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కొంతమంది మహిళలు చేసిన గార్భా డ్యాన్స్ గురించే ఇప్పుడు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా గార్భా డ్యాన్స్‌కి సంప్రదాయ దుస్తుల్లో చక్కగా రెడీ అయ్యి డ్యాన్స్ చేస్తారు. కానీ, ఇక్కడ ఈ మహిళలు సంప్రదాయ దుస్తులకు బదులు పీపీఈ (PPE) కిట్లు ధరించి గార్భా డ్యాన్స్ చేశారు. కరోనా పై అవగాహన పెంచేందుకు ఇలా చేసినట్లు డ్యాన్స్ నిర్వాహకులు రక్షబెన్ బోరియా తెలిపారు. ‘కరోనా ఇంకా పోలేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. కనీస జాగ్రత్తలు పాటించాలి’ అనే దానిపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమానికి పూనుకున్నట్లు బోరియా వివరించారు. పీపీఈ కిట్లు ధరించిన గార్భా డ్యాన్స్ చేసిన మహిళల వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.  


Also Read: పూరీ తీరంలో గవ్వలతో అమ్మవారు... సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపకల్పన 


Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం


Also Read: కాఫీ, టీలు తాగే ముందు మంచి నీళ్లు తాగవచ్చా? తాగితే ఏమవుతుంది?