మనలో చాలా మంది ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో ఇంటికి వేసే తాళం ఎక్కడ పెట్టామా అని వెతుక్కుంటాం. వెంటనే అది కనపడక పోయేటప్పటికీ ఎంతో చిరాకు వస్తుంది. అలాగే బయటికి వెళ్లి ఇంటికి వచ్చి తాళం తీసేందుకు హ్యాండ్ బ్యాగ్, ప్యాంట్ జేబులు వెతుక్కుంటూ ఉంటాం. ఒక్కోసాని ఆఫీసులో పని మధ్యలో ఇంటికి తాళం వేశామా? లేదా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఇలాంటి వారి కోసమే ఈ కొత్త టెక్నాలజీ. 


టెక్నాలజీ పుణ్యమా అని చాలా మంది ఎంతో స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. మనుషుల స్థానంలో రోబోలు వాడేస్తున్నారు. అలాగే ఈ దంపతులు తమ ఇంటి తలుపులకు తాళం స్థానంలో ఎలక్ట్రానిక్ డోర్లు ఉపయోగించారు. అవి మూసేందుకు, తెరిసేందుకు ఈజీగా ఉండేందుకు ఒక చిప్‌ను తమ చేతిలో అమర్చుకున్నారు. ఇంకేముంది వీళ్లు తాళం వేయాలని, తీయాలన్న ఆందోళనే ఉండదు. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంట? ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం. 


Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి



ఈ వీడియోలో ఉన్న అమ్మాయి తన కుడి చేతి బొటన వేలు, చూపుడు వేలు మధ్య ఖాళీ భాగంలో ఓ చిప్ అమర్చుకుంది. 2020 జూన్ 25న ఆమె వైద్యుల సాయంతో చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా చిప్ అమర్చుకుంది. ఆ చిప్ ద్వారా ఆమె ఇంటి తలుపులతో పాటు కబోర్డులు ఎలా ఓపెన్ చేస్తుందో ఈ వీడియోలో చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను తమకు ఇలాంటి చిప్ కావాలని అడుగుతున్నారు. ఇది ఎంతో సింపుల్. టెక్నాలజీతోనే సాధ్యం. నా భర్త ఇది తయారు చేశాడు. మేమిద్దరం ఈ చిప్ వాడతాం అని చెప్పేస్తుంది.


Also Read: తొమ్మిది రంగుల నవరాత్రి... ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి... ఆ రంగు ప్రత్యేకత ఏంటి?



ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిప్ ఎలా తయారు చేస్తుందో, మనకు ఏ మేరకు అవసరం పడుతుందో చూడండి. మరికొందరు నెటిజన్లు మాత్రం ఇదీ మరీ స్మార్ట్‌గా ఉంది. ఎవరైనా హ్యాకర్లు చిప్‌ని హ్యాక్ చేసి ఇంట్లోకి చొరబడతారు అని కామెంట్లు పెడుతున్నారు.   


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి