ఇజ్రాయిల్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్యూర్‌ –ప్లే  క్లౌడ్‌ నేటివ్‌ సెక్యూరిటీ సంస్థ ఆక్వా సెక్యూరిటీ కొవిడ్‌ బాధితులకు అండగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆక్వాథాన్‌ కార్యక్రమంలో విరాళాలు సేకరించింది. వాటిని కొవిడ్‌ బాధితుల వైద్యం, ఇతర కార్యక్రమాలకు అందిస్తున్నారు. కొవిడ్‌తో మరణించిన సంపాదనాపరుల ఇళ్లకు సాయపడుతోంది.  ఏడు రోజుల పాటు తమ స్టెప్‌ కౌంట్‌ను నమోదు చేసి ఆక్వాథాన్‌ నిర్వహించారు.


Also Read: ఆదాయపన్ను రీఫండ్‌ రాలేదా? ఎప్పుడొస్తుందో తెలియడం లేదా? ఇలా స్టేటస్‌ తెలుసుకోవచ్చు


ప్రపంచ వ్యాప్తంగా 12 దేశాలలోని ఆక్వా సెక్యూరిటీ బృందం సహాయ కార్యక్రమాలు చేపట్టింది. దాదాపు 150 మందికి పైగా ఉద్యోగులు 11 మిలియన్‌ అడుగులు వేశారు. ఆక్వా సెక్యూరిటీ తమ ఉద్యోగులు సమకూర్చిన ఆరు లక్షల  రూపాయలను నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌కు అందజేసింది.


 ‘‘కొవిడ్‌–19 వల్ల దేశంలో ఏర్పడిన విపత్కర  పరిస్థితుల పట్ల మేము తీవ్రంగా ఆందోళన చెందాము. ఈ  పోరాటానికి ఆక్వాథాన్‌ మద్దతుగా నిలిచింది. కొవిడ్‌తో కుటుంబంలోని సంపాదనాపరులు చనిపోయిన కుటుంబాలకు సాయం చేసింది. మా అంతర్జాతీయ శ్రామిక శక్తి సాయంతో సమాజానికి తిరిగి ఎంతోకొంత తిరిగిచ్చామని ఆనందిస్తున్నాం. ఆక్వాథాన్‌ లాంటి కార్యక్రమాల ద్వారా మేము చిన్న మార్పును తీసుకురాగలమని ఆశిస్తున్నాం’’ అని ఆక్వా ఇండియా  అండ్‌ ఆర్‌ అండ్‌ డీ హెడ్‌ భువన్‌ భట్‌ అన్నారు.


Also Read: మూడు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం-వెండి ధరలు, మీ నగరంలో బంగారం వెండి ధరలివే


‘‘ నా మొట్టమొదటి ఫిజికల్‌ కమ్యూనిటీ యాక్టివిటీ ఆక్వాథాన్‌.  వీలైనంతగా తోడ్పాటును అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. నా వంతు పాత్ర పోషించాలనుకున్నాను. ఈ అనుభవం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ఆక్వా సెక్యూరిటా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తేజస్వి చెరుకూరి అన్నారు.


Also Read: 350+లో సెన్సెక్స్‌.. 130+లో నిఫ్టీ.. నేడు ఆల్‌టైం హై పక్కానే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి