కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామానికి చెందిన వంశీ అనే విద్యార్థి అమడగుంట్ల హాస్టల్‌లో పదో తరగతి చదివాడు. ఏడో తరగతి వరకు కోడుమూరు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం అమడగుంట్ల హాస్టల్‌లో సీటు రావడంతో టీసీ తీసుకుని అమడగుంట్ల జిల్లా పరిషత్ పాఠశాలలో చేరాడు. 8, 9, 10 తరగతులు హాస్టల్‌లోనే ఉంటూ చదువుకున్నాడు. పదో తరగతి పరీక్షలకు ఫీజు కట్టాడు. ఈ ఏడాది కోవిడ్ కారణంగా విద్యార్థులు అందరినీ పాస్ చేస్తున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడంతో వంశీ కూడా ఉత్తీర్ణత సాధించాడు.


పరీక్ష పాస్ అయిన ఆనందంతో పాఠశాలకు వెళ్లిన వంశీకి ఊహించని పరిణామం ఎదురైంది. మార్కుల మెమో రాలేదని టీచర్లు తెలిపారు. అతనికి కేవలం టీసీ ఇచ్చి పంపారు. మిగతా విద్యార్థులందరికీ మెమోలు ఇచ్చి తనకు మాత్రం ఇవ్వకపోవడంతో విషయాన్ని తన తండ్రికి తెలిపాడు. వంశీ తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని నిలదీయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వంశీ గత మూడేళ్లుగా పాఠశాలలో చదువుతున్నా.. అతని పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని తెలిసింది. ఈ కారణంగానే వంశీ మార్కుల మెమో రాలేదని వంశీ తండ్రి గుర్తించాడు. టీచర్ల నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ భవిష్యత్ గందరగోళంలో పడిందని వాపోయాడు. 


Also Read: ఆర్టీసీ బస్సులకి కూడా ‘అయ్యయ్యో వద్దమ్మా..’ ఈ టైంలో సజ్జనార్ ప్లాన్ మామూలుగా లేదుగా..! 


ఇంటర్ అడ్మిషన్లకు సమీపిస్తున్న గడువు.. 
రాష్ట్రంలో ఇంటర్ అడ్మిషన్లకు గడువు సమీపిస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వంశీ తన తండ్రితో కలిసి మానవ హక్కుల సంఘాన్ని (హెచ్ఆర్సీ) ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. హాస్టల్లో ఉంటూ మూడు సంవత్సరాలు చదివానని.. పదో తరగతి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టానని చెప్పాడు. ఇప్పుడు టీచర్లు ఆన్‌లైన్‌లో తన పేరు లేనందున పదో తరగతి మార్క్స్ మెమో రాలేదంటున్నారని వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యాడు. 


Also Read: గత పదేళ్లలో రూ.200 కోట్లు స్వాహా... తెలుగు అకాడమీ స్వాంలో కొత్త కోణం... 


టీచర్ల తప్పిదం వల్ల నా కుమారుడి భవిష్యత్ నాశనమైంది: తిప్పన్న
టీచర్ల తప్పిదానికి తన కుమారుడి భవిష్యత్ నాశనమైందని వంశీ తండ్రి తిప్పన్న వాపోయాడు. ఆన్‌లైన్‌లో పేరు లేనప్పుడు హాస్టల్ లో భోజనం, పుస్తకాలు, బట్టలు ఎలా ఇచ్చారంటూ అధికారులను ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీచర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


Also Read: ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు... కేఆర్ఎంబీ కీలక ప్రకటన... బోర్డు పరిధిలోకి జల విద్యుత్ పై తెలంగాణ అభ్యంతరం 


Also Read: మహిళలపై చెయ్యి వేస్తే నడిరోడ్డుపై కాల్చిపారేయాలి... ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి