భార్యను పాముతో కరిపించి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన భర్తకు కేరళలోని జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన భర్తకు రెండు జీవిత ఖైదులు విధించింది. అంతేకాదు దీనితో పాటు రూ.5.85లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తం చెల్లించకపోతే అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసులో అక్టోబర్​ 11న విచారణ ముగించిన కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది.


సినిమా తరహాలో ట్విస్ట్..


ఈ కేసులో నిందితునికి శిక్ష పడేందుకు కేరళ పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. అన్నిరకాల ఆధారాలను సేకరించారు. నాగ్‌పూర్, ఇందోర్​లలో వెలుగుచూసిన ఈ తరహా కేసులను అధ్యయనం చేశారు.


సాక్ష్యాలను నిరూపించేందుకు 87 మందిని విచారించిన పోలీసులు 1000 పేజీల ఛార్జ్ షీట్ సమర్పించారు. సెక్షన్ 302 ఐపీసీ(హత్య), 326 (హాని కలిగించే పదార్థాల ద్వారా గాయపరచడం), 307 (హత్యాయత్నం), 201 (సాక్ష్యాలను ధ్వంసం చేయడం) కింద అభియోగాలు మోపారు.


ఏం జరిగింది?


ఉత్తర, సూరజ్ ఎస్ కుమార్ భార్యాభర్తలు. 2020 మే 7న కొల్లాం జిల్లా అంచల్‌లోని భర్త ఇంట్లో ఆమె పాము కాటు వల్ల ప్రాణాలు కోల్పోయారు. సూరజ్ మొదట్లో ఓ వైపర్‌ను, ఆ తర్వాత ఓ కోబ్రాను కొని, ఉత్తరకు కాటు వేయించినట్లు రుజువైంది. మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనే.. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకున్నాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు.


యూట్యూబ్‌లో చూసి..


యూట్యూబ్​లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో సూరజ్ నేర్చుకున్నాడు. పాములవాడికి డబ్బులు ఇచ్చి సర్పాన్ని తీసుకున్నాడు. ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేయగా.. ఆమెను రెండు సార్లు కాటువేసింది. ఉత్రా ప్రాణాలు కోల్పోయింది. అంతకు ముందే ఓసారి పాము కాటుకు గురికావటంపై అనుమానించిన ఉత్రా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటకు వచ్చాయి.


Also Read: Corona Cases: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు


Also Read: GatiShakti Launch: రూ.100 లక్షల కోట్లతో 'పీఎం గతి శక్తి'కి మోదీ శ్రీకారం.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు


Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి