దేశంలో కరోనా కేసులు 20 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. కొత్తగా 15,823 కరోనా కేసులు నమోదుకాగా 226 మంది చనిపోయారు. 22,844 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- మొత్తం కేసులు: 3,40,01,743
- యాక్టివ్ కేసులు: 2,07,653
- మొత్తం రికవరీలు: 3,33,42,901
- మొత్తం మరణాలు: 4,51,189
- మొత్తం వ్యాక్సినేషన్: 96,43,79,212 (గత 24 గంటల్లో 50,63,845)
గత 19 రోజులుగా రోజువారి కరోనా కేసులు 30 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. గత 108 రోజులుగా ఈ సంఖ్య 50 వేలకు దిగువనే ఉండటం ఊరట కలిగిస్తోంది.
యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,653కి చేరింది. గత 214 రోజుల్లో ఇదే అత్యల్పం. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.61గా ఉంది. రికవరీ రేటు 98.06 శాతంగా ఉంది.
మంగళవారం మొత్తం 13,25,399 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 58,63,63,442కు చేరింది.
కేరళ..
కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దిగువకు పడిపోయింది. ప్రస్తుతం ఈ సంఖ్య 96,646 వద్ద ఉంది. రాష్ట్రంలో కొత్తగా 7,823 కేసులు నమోదుకాగా 106 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 48,09,619కి పెరిగింది. మరణాల సంఖ్య 26,448కి చేరింది. గత 24 గంటల్లో 86,031 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మొత్తం 14 జిల్లాల్లో త్రిస్సూర్‌లో అత్యధికంగా 1,178 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎర్నాకులం (931), తిరువనంతపురం (902) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 2,069 కేసులు నమోదయ్యాయి. 43 మంది కరోనాతో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి