" నీకు తెలుసుగా ..మనకు క్యూలో నిలబడే అలవాటు లేదు. అందుకే నిన్ను తీసుకొచ్చా.. వెళ్లి టిక్కెట్స్ తీసుకురా..పో " అనే డైలాగ్ ఓ తెలుగు సినిమాలో ఉంటుంది. ఇలా క్యూలో నిలబడటం అలవాటు లేని వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటివారు ఎక్కువగా డబ్బున్న వారే అయి ఉంటారు. మరి వాళ్లకు లేని అలవాటును తాను అలవాటుగా మార్చుకుని ఎందుకు డబ్బులు సంపాదించకూడదు అనే ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. కానీ బ్రిటన్‌లో ఓ వ్యక్తికి వచ్చింది. అంతే ఇప్పుడు అతను రోజుకు  160 యూరోలు సంపాదిస్తున్నాడు. ఆ మొత్తం మన రూపాయల్లో అయితే పదహారు వేలు. 


Also Read: సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం


బ్రిటన్‌లో ఫ్రెడ్డి బెకిట్ అనే వ్యక్తి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఎందుకంటే అతను ఎంచుకున్న వృత్తి క్యూలో నిల్చుకోవడం. క్యూలో నిలబడం ఇష్టం లేని.. బాగా డబ్బున్న వ్యక్తులు .. ఫ్రెడ్డీకి గంటకు ఇరవై యూరోలు చొప్పిన ఇచ్చి తమ తరపున క్యూలో నిలబడుతున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఫ్రెడ్డీకి బదులుగా తాము వెళ్తున్నారు. ఇలా రోజూ ఎనిమిది గంటల పాటు వివిధ రకాల వ్యక్తుల కోసం ఫ్రెడ్డీ  పలు చోట్ల నిలబడుతున్నాడు. 


Also Read: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు


ఫ్రెడ్డీ తన ప్రోఫైల్‌ను టాస్క్ రాబిట్ అనే వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసుకున్నాడు. ఇది మన దేశంలో ఉండే అర్బన్ క్లాప్ లాంటిది. అన్ని రకాల సర్వీసులు అందించేవారు తమ సేవలు పొందేందుకు ఇక్కడ లిస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెడ్డీ కూడా తన సేవలు అవసరమైన వారు పొందవచ్చని లిస్ట్ చేసుకున్నారు. ఇందులో క్యూలో నిలబడటంతో పాటు పెట్ సిట్టింగ్, ప్యాకింగ్, గార్డెనింగ్ వంటి పనులు చేస్తానని ప్రోఫైల్ పెట్టుకున్నాడు. కానీ ఏ పని చేసినా గంటంకు ఇరవై యూరోల కంటే ఎక్కువ తీసుకోడు. 



Also Read: రాత్రికి రాత్రి వింతగా మారిపోయిన ఇసుక.. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఫొటోలు వైరల్





క్యూలో నిలబడలేని రిచ్ పీపుల్ కోసం తాను నిలబడుతున్న ఫ్రెడ్డీ...  ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినంత సేపు నిలబడేది లేదంటున్నాడు. కొద్ది గంటలు మాత్రమే ఉంటానంటున్నారు. బాగా ఆదాయం వస్తున్నా... సరే.. తన పద్దతిని తాను ఫాలో అవుతున్నానంటున్నారు. ఎలాంటి స్కిల్స్ లేకపోయినా కేవలం నిలబడటం ద్వారా పెద్ద ఎత్తున ఆర్జిస్తున్న ఫ్రెడ్డీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. 

 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి