దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులు అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. భక్తులు ఎవరికి నచ్చినట్లు వాళ్లు అమ్మవారి విగ్రహాలను తయారు చేసి పూజ చేస్తున్నారు. అలాగే కొందరు భక్తులు తమలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నంలో అమ్మవారి బొమ్మలను తయారు చేశారు.
Also Read: మొన్న గవ్వలతో... నేడు కూరగాయలతో... అమ్మవారి సైకత శిల్పం
ఒడిశాలోని పూరీకి చెందిన బిస్వజీత్ నాయక్ అనే యువకుడు ఐసు పుల్లలతో అమ్మవారి బొమ్మని తయారు చేశారు. ఇది చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 275 ఐసు పుల్లలతో అమ్మవారి ముఖాన్ని తయారు చేసి దానికి చక్కగా రంగులు అద్ది ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. బిస్వజీత్ తయారు చేసిన అమ్మవారి బొమ్మను చూసేందుకు చుట్టు పక్కల వారు వస్తున్నారు. ఈ బొమ్మను తయారు చేసేందుకు బిస్వజీత్‌కి ఆరు రోజుల సమయం పట్టిందట. ‘మండల ఆర్ట్’తో ఈ బొమ్మను చేసినట్లు అతడు చెప్పాడు. ఈ బొమ్మ ఎత్తు అడుగు కంటే తక్కువే.
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ కూడా పూరీ తీరంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి సైకత శిల్పాలను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సముద్రపు గవ్వలతో అమ్మవారి సైకత శిల్పాన్ని అలంకరించగా... తాజాగా పలు రకాల కూరగాయలతో అమ్మవారి సైకత శిల్పాన్ని అలంకరించి వావ్ అనిపించుకున్నాడు.
ఒడిశాలో కరోనా వల్ల నిబంధనలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఏడుగురు కంటే ఎక్కువ మంది ఒకే చోట పూజలో పాల్గొన వద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి
Also Read: 25వేల బిస్కెట్లు... 24 అడుగుల మస్కట్... తయారు చేయడానికి 15 గంటల సమయం