ఆ తండ్రి కూతుళ్లు విమానం ఎక్కారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా?. అదేంటంటే... ఆ విమాన ప్రయాణంలో ఆ తండ్రి పైలెట్‌గా, అదే విమానంలో ఆ పైలెట్ కూతురు ప్రయాణికురాలిగా. ఆ చిన్నారికి ఇదే తొలి విమాన ప్రయాణం. తండ్రి పైలెట్‌గా ఉండే విమానంలో తొలి ఫ్లైట్ ప్రయాణం చేసే వాళ్లు ఎంత మంది ఉంటారు చెప్పండి. 






ఆ లక్కీ ఛాన్స్ ఈ చిన్నారి కొట్టేసింది. విమానం ఎక్కి తన తండ్రి కోసం ఎదురుచూస్తోంది. అంతలో ఆ చిన్నారి తండ్రి కాక్ పిట్‌లోకి వెళ్తూ తన కూతుర్ని చూసి మురిసిపోయాడు. ఆ చిన్నారి కూడా తన తండ్రిని చూసి ఎంతో సంబరపడిపోయింది. ఈ తతంగాన్నంతా ఆ చిన్నారి తల్లి వీడియో తీసింది. ఆ వీడియోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది. ఈ వీడియో నెటిజన్లు కూడా ఆ చిన్నారి సంబరానికి ఫిదా అయిపోయారు. ఇంతకీ ఆ చిన్నారి పేరు ఏంటంటే... షనయా మొతిహర్. 


Also Read: ట్రెడిషనల్ లుక్స్‌లో జాన్వీ కపూర్... చీర కట్టులో అదుర్స్


‘విమానంలో నా తొలి ప్రయాణం. మా నాన్న నన్ను దిల్లీ తీసుకెళ్తున్నాడు. నా తండ్రిని చూడటం ఎంతో ఎక్సైట్‌గా ఉంది. లవ్యూ’ అని తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టులో రాసుకొచ్చింది షనయా. ఇప్పటి వరకు ఈ వీడియోకి ఇరవై వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి. 


Also Read: ఈ దంపతులు ఇంటికి తాళం వేయరు... చిప్‌తోనే ఇంటికి లాక్, అన్ లాక్


Also Read: 25వేల బిస్కెట్లు... 24 అడుగుల మస్కట్... తయారు చేయడానికి 15 గంటల సమయం


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి