అమ్మాయిని వేధించినందుకు నాలుగునెలలుగా జైల్లోనే ఉన్నాడు ఓ యువకుడు. తనకు శిక్షను రద్దు చేయాలని కోరుతూ ఆ యువకుడు మళ్లీ కోర్టుకు పిటిషన్ పెట్టుకున్నాడు. ఆ పిటిషన్లో తన వయసు కేవలం 20 సంవత్సరాలని, తన కుటుంబం గ్రామంలో బట్టలు ఉతుక్కుని జీవిస్తారని, అంటే తాము సమాజానికి సేవ చేసే వాళ్లమని చెప్పుకొచ్చాడు. ఆ పిటిషన్ చదివిన జడ్జి... ఆ యువకుడికి ఊహించని శిక్ష వేశాడు. అసలేం జరిగిందంటే...


బీహార్లోని మధుబనిలో లలన్ అనే యువకుడు అయిదు నెలల క్రితం ఓ ఆడపిల్లలని అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేశాడు. అమ్మాయి తరపు వారు కేసు పెట్టడంతో జిల్లా అడిషనల్ జడ్జి అవినాష్ కుమార్ అతడికి జైలు శిక్ష వేశారు. తాజాగా ఆ జైలు శిక్షను రద్దు చేయమని కోరుతూ ఆ యువకుడు కోర్టును కోరాడు. దానికి జడ్జి ఆ గ్రామంలో ఉన్న 2000 మంది ఆడ వాళ్ల బట్టలు ఆ యువకుడే ఉతకాలని, అది కూడా ఉచితంగా చేయాలని, అలా చేస్తానని ఒప్పుకుంటే బెయిల్ ఇస్తానని చెప్పారు. కేవలం ఒక్కరోజు ఉతికితే సరిపోదు... ఆరు నెలల పాటూ ఉతకాలి. అది కూడా ఇంటింటికీ వెళ్లి తానే వాటిని తెచ్చుకోవాలి. అన్నట్టు ఉతికిన దుస్తులను ఇస్త్రీ చేసి తిరిగి ఊళ్లో వాళ్లకి ఇచ్చేయాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆడవాళ్ల మీద గౌరవం కూడా పెంచుకోవాలి. 
ఆరు నెలల పాటూ అలా పనిచేశాక, ఆ ఊరి సర్పంచ్ లేదా గ్రామ సేవక్ దగ్గర నుంచి సర్టిఫికెట్ తెచ్చి కోర్టుకు సమర్పించాలి. అప్పుడే అతని మీద ఉన్న కేసును కోర్టు కొట్టివేస్తుందని తీర్పు ఇచ్చారు జడ్జి. ఈ షరతులన్నింటికీ ఒప్పుకోక తప్పలేదు ఆ యువకుడికి.  ఇప్పుడు అతని గ్రామంలో ఇదో హాట్ టాపిక్ అయిపోయింది. ఆడవాళ్లు మాత్రం తమకు పని తగ్గిందని ఆనందిస్తున్నారట. 
Also read: గుడ్డులోని పచ్చసొన తింటే బరువు పెరుగుతారని తినకుండా పడేస్తున్నారా? ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు?
Also read: ఇరవై మూడేళ్లకే ఆరు సార్లు క్యాన్సర్ ను జయించిన విజేత... ఇప్పుడు అతడో స్పూర్తిప్రదాత
Also read: గుండె జబ్బుకు గురికాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే... తేల్చిన హార్వర్డ్ అధ్యయనం


Also read: భోజనం చేశాక ఈ పనులు చేయకండి... అనారోగ్య సమస్యలు తప్పవు


Also read: పిల్లలకు రోజుకో అరస్పూను నెయ్యి తినిపించండి... మతిమరుపు దరిచేరదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి