వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆగిపోయిన పాదయాత్రను మార్చి ఒకటో తేదీ నుంచి మళ్లీ ప్రారంభించనున్నారు. ల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి షర్మిల పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఎన్నికల వరకూ 4 వేల కిలోమేటర్ల మేర యాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నవంబర్ పదో తేదీన నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ఆగిపోయింది. అప్పటికి చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించి నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి  మండలం చౌడంపల్లికి చేరుకున్నారు. నిరాటకంగా పాదయాత్ర చేయాలనున్నప్పటికీ ఎన్నికల కోడ్.. ఆ తర్వాత కరోనా ఆంక్షలు అడ్డంకి కావడతో పాదయాత్ర ప్రారంభం కాలేదు. 


తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడమే ప్రధాని మోదీ పద్దతి: హరీష్ రావు ఫైర్


ఇప్పుడు తెలంగాణలో మూడో దశ ముగిసిందని ఎలాంటి ఆంక్షలు లేవని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. షర్మిల పాదయాత్ర చేయకపోయినా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యలో ఆత్మహత్య చేసుకున్న రైతుల్ని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర కూడా చేశారు.  రైతు ఆవేదనా యాత్ర పేరుతో రైతుల్ని పరామర్శించారు.  నిరుద్యోగుల్ని కూడా  పరామర్శించారు. అయితే  కరోనా ఆంక్షల కారణంగా ఆమె పర్యటనలకు దీక్షలకు పెద్దగా అనుమతులు రాలేదు. అయినప్పటికీ అవకాశం ఉన్న చోటల్లా బాధితుల్ని పరామర్శిస్తూనే రాజకీయాలు చేస్తున్నారు. 


మోదీ వ్యాఖ్యల ద్వారా రెండు పెద్ద నిజాలు బయటికి, అవేంటంటే.. రేవంత్ రెడ్డి ట్వీట్


ప్రతీ రోజు ట్విట్టర్‌లో ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో షర్మిల రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌కూ సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఆ వివాదం ఏమయిందో స్పష్టత లేదు. పార్టీ పేరు మార్చుకోవాలని లేఖ రాసినట్లుగా ఈసీ సమాచారహక్కు చట్టం కింద సమాచారం ఇచ్చింది. అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరును మార్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఏపీలోనూ పార్టీ పెట్టే అవకాశం ఉందన్న ప్రచారంపైనా ఆమె గతంలో స్పందించారు. 


పద్ధతులు తెలిసిన వారు ప్రధాని మోదీలా మాట్లాడరు.. టీఆర్ఎస్ ఎంపీ కేకే ధ్వజం


ఎందుకు పెట్టకూడదని ఇచ్చిన సమాధానం కలకలం రేపింది. తర్వాత తన రాజకీయం అంతా తెలంగాణతోనే ముడిపడి ఉందని.. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని తెలిపారు. మార్చి ఒకటి నుంచి ప్రజాప్రస్థానం పాదాయత్ర ప్రారంభించి.. ఏకధాటిగా గ్రేటర్ హైదరాబాద్ తప్ప మిగతా ప్రాంతం మొత్తాన్ని షర్మిల చుట్టేసే అవకాశం ఉంది.