Harish Rao Comments Pm Modi: తెలంగాణ రాష్ట్రం ఎదుగుదలను చూడలేకే ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన మీరు, తెలంగాణ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడమా అంటూ కామెంట్ చేశారు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్ తో పాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతి పక్షాలు డివిజన్ ఆడిగినప్పటికీ, మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? ఇదెక్కడి రాజ్యాంగ విధానం అంటూ ప్రధాని మోదీని హరీష్ రావు ప్రశ్నించారు.
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు ముందుకెళ్తుంటే ప్రధాని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని.. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షను అవమానించడం సరికాదన్నారు. పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు మీకు అక్రమంగా కనిపించిందా.. ? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డెవలప్‌మెంట్‌లో గుజరాత్‌ను మించి తెలంగాణ ముందుకెళ్తున్నందని భయపడి బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రం వ్యక్తం చేశారు.
దేశంలోని రైతులు మొత్తం తీవ్రంగా వ్యతిరేకించినా మీరు వ్యవసాయ బిల్లులు తేవడం మాత్రం మీకు న్యాయంగా కనిపించింది అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రాణాలకు తెగించి చేసిన పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయంగా కనిపించిందా.. ఇదెక్కడి న్యాయమని ప్రధాని మోదీని ట్విట్లలో హరీష్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు నిరసన చేస్తున్నారు. అన్ని పట్టణాలు, నగరాలలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. బీజేపీ నేతల దిష్టిబొమ్మను దహనం చేస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం కక్కుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గంగాధర మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం కక్కుతూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గంగాధర మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం జరిగింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, పార్లమెంట్ వేదికగా తెలంగాణపై మోడీ అహంకారపూరితమైన మాటలకి వ్యతిరేకంగా పాన్ గల్ మండలం మల్లాయిపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించి అనంతరం బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
Also Read: TRS MPs Protest: పద్ధతులు తెలిసిన వారు ప్రధాని మోదీలా మాట్లాడరు.. టీఆర్ఎస్ ఎంపీ కేకే ధ్వజం
Also Read: Bandi Sanjay: కేసీఆర్ జోకర్.. తెలంగాణలో ఆయనే మాకు అస్త్రం: బండి సంజయ్