కూరగాయల ధరలు రోజు రోజులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుండటంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హనుమకొండ కూరగాయల మార్కెట్‌లో కిలో టమోటా ధర రూ.100 పలకడంతో వినియోగదారులు ధరల పెరుగుదలపై మండిపడుతున్నారు. వీటితో పాటు ఇతర కూరగాయలు కుడా కిలో రూ.80 నుంచి 90ని మించి చేరుకున్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే భయడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్య, దిగువ మధ్య తరగతి, పేదవారు కూరగాయలు కొనేందుకు వెనకాడుతున్నారు. దీంతో ఈ ప్రభావం వలన మార్కెట్‌లో బిజినెస్ పూర్తిగా పడిపోయింది. 


కొనుగోలు దారులు లేకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారులు నష్టం చూడాల్సి వస్తుంది. ఒక్కో వ్యాపారి రోజుకు 80 నుంచి 100 కిలోల వరకు టమాటాలు విక్రయించేవారు. ధరల పెరుగుదలతో ప్రస్తుతం 20 కిలోలు అమ్మడం కూడా కష్టంగా మారిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Also Read: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పూర్తి - టీడీపీ అభ్యర్థికి ఒక ఓటు ఆధిక్యం ! హైకోర్టు తీర్పు తర్వాతే తుది ఫలితం !


వరంగల్ ప్రాంతానికి ప్రతి రోజు మాదనపురం నుంచి రమారమి 5 నుంచి 6 లారీల టమోటా సరఫరా అవుతుండేది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు ఒక లారీ లోడ్‌లో మాత్రమే టమోటాలు మార్కెట్‌లో దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే వ్యాపారంలో పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని వ్యాపారులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రజలు ధరలు చూసి కొనుగోలు చేయకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. మరికొందరు కొసరి కొసరి కూరగాయలు కొంటున్నారు.


ఎప్పుడు దిగి రావచ్చు?
అయితే, ప్రస్తుతం పెరిగిన ఈ టమోటా ధరలు మరో నెల రోజుల వరకు దిగి రావడం కష్టమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమోటా మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌, ఛత్తీస్‌గడ్‌లోని పలు ప్రాంతాల నుంచి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Also Read: Tomato Price Today: పెట్రోల్ రేట్లను దాటేసిన టమోటా.. కొన్నిచోట్ల రూ.140, సడెన్‌‌గా పెరుగుదల ఎందుకు?


Also Read: MP Raghurama: ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది.. ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష


Also Read: పరాయి వ్యక్తితో బెడ్‌రూంలో భార్య, భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. చివరికి ఏమైందంటే..


Also Read: ఇద్దరివీ వీఆర్వో ఉద్యోగాలు, అన్నీ పాడుపనులే.. ఏళ్లుగా వారికి గాలం.. చివరికి ఇలా..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి