తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న కొత్తగా నలుగురికి ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించగా.. నేడు మరొకరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అయితే, ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి లేదని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో ఉన్న కేసుల్లో ఏడు కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారే అని డీహెచ్ తెలిపారు.
తాజాగా తెలంగాణలో హన్మకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 8కి చేరాయి. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని తన కార్యాలయంలో డీహెచ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మొత్తం 90 దేశాలకు ఒమిక్రాన్ విస్తరించింది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుందని ఎవరూ ఆందోళన చెందకండి. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ సోకిన వారిలో బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించడం లేదు.
మన దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో ఒకరిద్దరు మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్క ఒమిక్రాన్ మరణమే జరిగింది. ఒమిక్రాన్ పట్ల అనవసర భయాందోళన వద్దు. ఒమిక్రాన్‌తో ఎలాంటి ప్రాణాపాయం లేదు. ఒమిక్రాన్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ నుంచి భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు రూపాంతరం వచ్చే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ కచ్చితంగా..
వ్యాక్సిన్ కచ్చితంగా అందరూ తీసుకోవాలి. అందరూ వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఈ వ్యాప్తికి కారణం. రాష్ట్రంలో 97 శాతం మంది ఫస్ట్ డోసు తీసుకున్నారు. 11 జిల్లాల్లో వంద శాతం ఫస్ట్ డోసు తీసుకున్నారు. 56 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. ఎక్కడైనా మాస్కు ధరించాలి. లాక్ డౌన్ పెడతారనే ప్రచారాలు నమ్మవద్దు. ప్రజలంతా బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలి. దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 8 కేసులు నిర్ధరణయ్యాయి.’’ అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
Also Read: Hyderabad: ఆకలితో ఉన్న వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి.. గాయాలతో మృతి, ఆ పొరపాటే కొంపముంచింది!
Also Read: Nizamabad: ఈ రాయి కింది నుంచి దూరితే కడుపు నొప్పి మాయం.. అసలు దీని సంగతేంటంటే..
Also Read: Hyderabad: ఆకలితో ఉన్న వ్యక్తిపై హోటల్ సిబ్బంది దాడి.. గాయాలతో మృతి, ఆ పొరపాటే కొంపముంచింది!
Also Read: CPI News: తెలంగాణలో కారుతో పొత్తుకు కామ్రెడ్లు సిద్ధమే..! వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి