Smita Sabharwal Transfer: తెలంగాణలో మరో మరి కొన్ని రోజుల్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచ దేశాలన్నీ చూసే ఈ ఈవెంట్ ఏర్పాట్లను తెలంగాణలోని టాలెంటెడ్ IAS స్మితా సభర్వాల్, టూరిజం సెక్రటరీ హోదాలో మొన్నటి వరకూ చూసుకున్నారు. కానీ ఆదివారం రాత్రి వచ్చిన IAS ట్రాన్స్‌ఫర్ లిస్టులో స్మితా సభర్వాల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆమెకు అప్పగించిన తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ పోస్టులోకే మళ్లీ పంపించారు.
కంచ గచ్చిబౌలిపై రగడ
కంచ గచ్చిబౌలిలోని HCU క్యాంపస్‌లో ఉన్న 400 ఎకరాల భూమిపై కొన్నిరోజులుగా ఎంతటి రగడ నడుస్తుందో తెలిసిందే. ఈ భూముల్లో చెట్లను తొలగించడాన్ని నిరసిస్తూ.. ట్విటర్‌లో వచ్చిన ఓ పోస్టును IAS Smita Sabharval రీ పోస్ట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన ప్రభుత్వం ఆమెకు నోటీసులు ఇవ్వడం... ఆమె సమాధానం చెప్పడం కూడా జరిగిపోయాయి. ఈ పరిణామాల్లో భాగంగానే ఆమెను మళ్లీ నాన్ ఫోకల్ పోస్టుకు పంపించినట్లు అర్థం అవుతోంది.
మార్చ్ 31న స్మితా సభర్వాల్.. Hi Hyderabad అనే ట్విటర్ హ్యాండిల్‌లో వచ్చిన AI జనరేటెడ్ ఇమేజ్‌ను షేర్ చేశారు. క్యాంపస్‌లో చెట్లను జెసీబీలు తొలగిస్తుంటే.. దాని ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్లుగా ఫోటోను AIలో క్రియేట్ చేశారు. అదే పోస్టును ఆమె షేర్ చేశారు. .. ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా AI ఫోటోలు షేర్ చేశారని కొంతమందిపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం ఆమెకు నోటీసులు ఇచ్చింది.
మిస్‌వరల్డ్ పోటీలు ఉన్నా సరే..
కేసీఆర్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన 2001 బ్యాచ్ IAS అధికారిణి స్మితా సభర్వాల్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక లూప్‌లైన్ లోకి మార్చింది. సీనియర్ IAS అధికారిణి, చాలా కీలక శాఖలు నిర్వహించిన స్మితకు అంతగా ప్రాధాన్యం లేని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా నియమించడం అంటే ఆమెను పక్కకు తప్పించడమే అని అప్పట్లో భావించారు. ఆమె సెంట్రల్ సర్వీసుకు వెళ్లిపోతారు అని ప్రచారం జరిగినప్పటికీ.. తాను ఇక్కడే ఉంటున్నా అని గట్టిగా చెప్పి మరీ ఆమె ఆ పోస్టులో చేరారు. మే నెలలో హైదరాబాద్ మిస్ వరల్డ్ పీజెంట్‌కు ఆతిథ్యం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామి. దీనిని దృష్టిలో ఉంచుకునో ఏమో కానీ ఈ ఈవెంట్లో కీలకంగా ఉండే టూరిజం, యూత్ అఫైర్స్ శాఖ సెక్రటరీగా స్మితా సభర్వాల్‌ను తీసుకొచ్చారు. డైనమిక్ లేడీ ఆఫీసర్‌గా ఉన్న స్మితా ఈ ఈవెంట్‌కు సంబంధించి గడచిన నెలరోజులుగా యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఓ పక్క ఈ ఈవెంట్‌లో ఉంటూ కూడా కంచ గచ్చిబౌలి గురించి రియాక్ట్ అయ్యారు. ఫలితమే.. ఈ ట్రాన్స్‌ఫర్. అంటే తెలంగాణలో జరిగిన మిగతా IAS అధికారుల రెగ్యులర్ ట్రాన్స్‌ఫర్లలో భాగంగానే ఇదీ జరిగినప్పటికీ.. నెల రోజులు కాకముందే ఆమెను వెనక్కు పంపడం మాత్రం కచ్చితంగా ఆమె సోషల్ మీడియాలో రియాక్ట్ అయిన విధానం ఫలితమే.
వెనక్కితగ్గని స్మిత
కేసీఆర్ ప్రభుత్వంలో CMOతోపాటు, ఇరిగేషన్, మిషన్ భగీరథ వంటి కీలక శాఖలు చూసిన స్మిత అప్పటి ప్రభుత్వ పెద్దలకు సన్నిహితం అనే కారణంతో ఈ ప్రభుత్వం ఆమెకు అప్రాధాన్య పోస్ట్ ఇచ్చింది. అయితే కిందటి నవంబర్‌లో మళ్లీ ఆమెను టూరిజం శాఖలోకి తీసుకొచ్చారు. అక్కడకు వచ్చిన కొన్ని నెలలు కూడా గడవక ముందే ఆమెను వెనక్కి పంపండం వెనుక.. వెనక్కి తగ్గిని ఆమె యాటిట్యూడే కారణం కావొచ్చు.
సాధారణంగా ప్రభుత్వ విధుల్లో, కీలకమైన పోస్టుల్లో ఉన్నవారు ప్రభుత్వానిక వ్యతిరేకంగా మాట్లాడేందుకు సాహసించరు. కానీ స్మిత సభర్వాల్ మాత్రం డిఫరెంట్. తాను చాలా సందర్భాల్లో ఇండిపెండెంట్‌గా .. బోల్డ్‌గా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్న IAS ఆఫీసర్.. ప్రభుత్వ చర్యలను తప్పు పట్టేలా ఉన్న ఒక X పోస్ట్‌ను షేర్ చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తాము ఆమెను ఫోకస్ పోస్టులోకి తీసుకొచ్చినా ఆమె ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరించారన్నది ప్రభుత్వ పెద్ద ఉద్దేశ్యం. అందుకే ఆమెకు నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 12న గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసుకు ఇచ్చాక... స్మిత సభర్వాల్ దానికి సమాధానం ఇచ్చారు.
సమాధానం చెప్పడం మాత్రమే కాదు.. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను సమాధానం ఇచ్చానని.. మరి ఆ పోస్టును షేర్ చేసిన 2 వేలమంది నుంచి కూడా ఇదే రకమైన వివరణ తీసుకున్నారా అని బహిరంగంగానే సోషల్ మీడయాలో ప్రశ్నించారు. ఇది ప్రభుత్వానికి మరింత ఆగ్రహం కలిగించింది. ఫలితమే ఇప్పటి ట్రాన్సఫర్.