రాష్ట్రంలోని  వర్సిటీల్లో విద్యార్థులకు ఫీజుల భారం పెరిగింది.  ఆర్ట్స్‌, సైన్స్‌ రెగ్యులర్‌ కోర్సులతోపాటు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజులు భారీగా  పెరిగాయి. పీజీ  రెగ్యులర్‌ కోర్సుల ఫీజు 2,410 నుంచి 14 వేలకు, ఎంఎస్సీ సైన్స్‌ రెగ్యులర్‌ కోర్సుల ఫీజు రూ.6410 నుంచి రూ.16వేలకు,  ఎంఎస్సీ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజు రూ.38 వేలకు పెంచారు.


ఇంజింనీరింగ్ ఐటీ, సివిల్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు


ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజును రూ.18వేల నుంచి 35 వేలకు, ఇంజనీరింగ్‌ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల ఫీజు రూ.75 వేలకు పెంచారు. ఫీజుల పెంపుతో చదవుకు దూరమవుతామని విద్యార్థులు ఆందోళన గురవుతున్నారు.


ప్రభుత్వ యూనివర్శిటీల్లో ఎక్కువగా పేద మద్య తరగతి విద్యార్థులకు నిలయాలు. ఆర్థిక పరిస్థితులు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు అడ్డంకి కాకూడదనే వర్శిటీలు అండగా నిలిచేలా ప్రభుత్వం చూడాలి. ఆ స్ఫూర్తితోనే ఎంతో మందిని ప్రభుత్వ వర్శిటీలు తీర్చిదిద్దుతున్నాయి. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత కాకతీయ యూనిర్శిటీలో చదువుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కానీ ఇప్పుడు పేద మద్య తరగతి విద్యార్థులకు ఈ యూనివర్శిటీలు దూరం చేస్తున్నారన్న అనుమానాలు విద్యార్థి సంఘాల నుంచి వ్యక్తమవుతోంది.


పేద విద్యార్థులు చదువుకునే గవర్నమెంట్‍ యూనివర్సిటీల్లోని ఎంఏ నుంచి ఎంబీఏ, ఎల్‍ఎల్‍బీ నుంచి ఇంజినీరింగ్‍ కోర్సుల వరకు ఫీజులు పెంపుపై సర్వత్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా పీజీ రెగ్యూలర్‍, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులతోపాటు ఇంజినీరింగ్‍ ఫీజులను అమాంతం డబుల్‍, ట్రిపుల్‍ చేసింది. గతంలో రూ.2410 ఉన్న ఎంఏ కోర్సును రూ.14,000లకు పెంచగా.. రూ.35 వేలు ఉండే ఇంజినీరింగ్‍ కోర్సును రూ.70 వేలు చేశారు. ఇదే తరహాలో 70 కోర్సుల చదువులు ఇప్పుడు కాస్ట్లీ అయిపోయాయి.  


రాష్ట్రంలోని గవర్నమెంట్‍ యూనివర్సిటీల్లో టీచింగ్‍, నాన్‍ టీచింగ్‍ స్టాఫ్‍ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంటున్నాయి. ఉన్నతస్థాయి చదువుల్లో రెగ్యూలర్‍ ఫ్యాకల్టీని నియమించాల్సిన ఉన్నా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. యూనివర్సిటీల్లోని ల్యాబ్‍ల్లో ప్రాక్టికల్స్  చేయలేని దుస్థితి. క్లాస్‍రూంలు, హాస్టళ్లలో కనీస మౌలిక వసతులు కల్పించడంలేదు. ఈ క్రమంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి స్పెషల్‍ బడ్జెట్‍ కేటాయించాల్సింది పోయి విద్యార్థులపై భారాన్ని నెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.


ఆయా యూనివర్సిటీల్లోని ఎగ్జిక్యూటివ్‍ కౌన్సిల్‍ కమిటీలు కొత్త ఫీజుల రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఓయూ ఫీజుల ఆధారంగా కేయూ.. కేయూ వివరాల ఆధారంగా మిగతా యూనివర్సిటీలు తమ విద్యార్థుల ట్యూషన్‍ ఫీజులు పెంచుతున్నాయి.  ఈ లెక్కన ఎంఏ, ఎంకామ్‍, ఎంటీఎం, ఎంఎస్‍డబ్ల్యూ, ఎంహెచ్‍ఆర్‍ఎం, ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంసీజే, ఎల్‍ఎల్‍బీ, ఎల్‍ఎల్‍ఎం, ఎంసీజే, బీఫార్మసీ, బీటెక్‍, బీఎడ్‍, బీపీఈడీ, ఎంపీఈడీ. ఐదేండ్ల ఇంటిగ్రేటేడ్‍ వంటి అన్ని కోర్సుల్లో ఫీజుల మోత మోగింది.


ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం... అందుకు అనుగుణంగా కాకతీయ వర్శిటీ పరిధిలోని ఏడు కాలేజీల ప్రిన్సిపల్స్ తో ఓ కమిటీ వేసి ఈ ఫీజులను నిర్ణయించారు. వీటికి నవంబర్ 18న పాలక మండలి ఆమోదం లభించింది. కొత్త ఫీజు విధానం 2021.22 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి.


ఈ ఫీజులపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నిరనసలు.. యూనివర్శిటీ బంద్, క్లాసుల బహిష్కరణ అనేక మార్గాల్లో తమ నిరననలు వ్యక్తం చేస్తున్నారు. కాకతీయ యూనివర్శిటీలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఇలాంటి ఆందోళనలే కొనసాగుతున్నాయి. ఓ వైపు సౌకర్యాలు లేవు.. మరోవైపు  ఫీజుల మోత ఎలా భరించగలమని ప్రశ్నిస్తున్నారు.


గతంలో ఫీజు రియంబర్స్ మెంట్‌తో విద్యార్థులపై భారం పడలేదు. కానీ ఇంజనీరింగ్ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో సివిల్ , ఐటీ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి 70 వేలకు పెంచారు. ఒక్కో బ్రాంచ్ లో 60 సీట్లు ఉండగా... పెంచిన ఫీజుతో ఈ ఏడాది 23 మంది కూడా జాయిన్ కాలేదని విద్యార్థులు చెబుతున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు హాస్టల్ వసతి కూడాలేదని చెబుతున్నారు. ఫలితంగా పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన తమ లాంటి వారు చదవుకు దూరమవ్వడమేనని అంటున్నారు. 


ఇంజినీరింగ్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ఉంది. 10 వేలలోపు ర్యాంకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఈడబ్ల్యూఎస్‌ కోటా వారు ఏ కాలేజీలో చేరినా పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇక 10 వేలపైన ర్యాంకు ఉన్నవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌గా రూ.35 వేలు ఇస్తుండగా,  విద్యార్థి చేరిన కాలేజీ ఫీజు అధికంగా ఉంటే ఆయా ఫీజును విద్యార్థియే భరించాల్సి ఉన్నది. ఈ లెక్కన .35 వేలుగా విద్యార్థులు భరించాల్సి ఉంటుంది. ఇంత ఫీజులు కట్టే అవకాశం ఉంటే సౌకర్యాలు లేని సర్కార్ వర్శిటీలో ఎందుకు చదువుతామని అంటున్నారు. 


 యూనివర్శిటీలో రెగ్యూల్,  సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పార్ట్ టైమ్ లెక్చర్లుగా పనిచేస్తున్న  వారి వేతనల్లో వ్యత్యాసం ఉంది. రెగ్యూలర్ కోర్సులకు చేప్పే వారితో సమానంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్టుల్లో చదవు చెప్పే అధ్యాపకులకు వేతనం ఇవ్వాలని చెప్పింది. కేయులో 185 మంది ఇలాంటి పార్ట్ టైమ్ లెక్చర్లు ఉండగా... సరి చేసిన వేతనాలతో ఏడాదికి 8.5 కోట్ల భారం పడుతుంది. ఈ నిధులను సమకూర్చుకునేందుకే ఫీజుల రివైజ్ కు సర్కార్ అవకాశం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే  ఫీజుల తరహాలోనే రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి విద్యార్థులపై భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం కోరతామని అధికారులు చెబుతున్నారు.


Also Read: KTR On Nadda : బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ.. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అని కేటీఆర్ విమర్శ !


Also Read: Cryptocurrency Prices Today, 05 January 2022: క్రిప్టో మార్కెట్లో వీడని స్తబ్దత! ఆచితూచి ఇన్వెస్టర్ల కొనుగోళ్లు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి