బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దారి తప్పి సికింద్రాబాద్ వచ్చారని ఆయన పోవాల్సింది ఎర్రగడ్డకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బండి సంజయ్ అరెస్ట్ తర్వాత క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వచ్చిన ఆయన... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైన విమర్శలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం తెలంగాణ అని కుటుంబపాలన చేస్తున్నారని మండిపడ్డారు. నడ్డా విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టారు. జేపీ నడ్డాపై తీవ్రమైన విమర్శలు చేశారు.
జేపీ నడ్డా వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ ఆయనను గౌరవప్రదంగా చూశామని.. ఇక నుంచి అలా భావించడం లేదన్నారు. జేపీ నడ్డా అబద్దాలకు అడ్డా అన్నారు. బండి సంజయ్‌కి, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఏడున్నరేళ్ల పాలనలో కేంద్రంలో బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని మోదీ రైతు విరోధి అని ఆరోపించారు. రైతులను మోదీ కంటే గోస పెట్టినోళ్లు ఎవరూ లేరన్నారు. అన్నదాతలకు అండగా ఉండేది కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో వడ్లు కొనరు.. ఇక్కడికొచ్చి దీక్షలు, ధర్నాలు చేస్తారని ఆయన ఆరోపించారు.
Also Read: Counsellor Vs Minister: ఆ మంత్రి నన్ను హత్య చేయించేస్తాడు.. టీఆర్ఎస్ నేత సంచలనం, హెచ్చార్సీ వద్దకు..
మోదీ హయాంలో సబ్ కా సాత్.. సబ్ కా వినాశ్ జరిగిందని కేటీఆర్ మండిపడ్డారు. నిన్న రైతులను రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఉద్యోగులను రెచ్చగొట్టారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్ఠి ఓట్లు పొందుందుకు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా బీజేపీ, ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ ఉన్నాయని అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని జేపీ నడ్డా విమర్శించారని.. ఆయన అత్త హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రిగా లేరా అని ప్రశ్నించారు.
Also Read: బీజేపీ ధర్మయుద్ధం చేస్తోంది... తెలంగాణలో నియంతృత్వ పాలన... కేసీఆర్ పై జేపీ నడ్డా ఫైర్
దేశంలో అత్యంత అవినీతి పూరిత ప్రభుత్వం కర్ణాటకలోనిబీజేపీ ప్రభుత్వమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 15లక్షల ఖాళీలున్నాయన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ గొప్ప పథకాలని మీ నీతిఅయోగ్ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. రైతుల పంట కొనలేని అసమర్థతకు మీ ఎఫ్‌సీఐకి వచ్చిందని ఆయన ఆరోపించారు. రైతులను దారుణంగా మోసం చేశారు కాబట్టి పంజాబ్‌లో రైతులు మోడీని అడ్డుకున్నారని.. ఇంత వరకూ దేశంలో ఏ ప్రధానికీ ఇలాంటి దుస్థఇతి పట్టలేదని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.
Also Read: తెలంగాణ హైకోర్టులో కొవిడ్, ఒమిక్రాన్‌పై విచారణ.. నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి