రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు (జనవరి 4) హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు నేడు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు, డీజీపీ మహేందర్ రెడ్డి నివేదికను కోర్టుకు సమర్పించారు. నివేదికలో ఉన్న వివరాల ప్రకారం.. కొత్త సంవత్సర వేడుకల్లో మొత్తం 907 కేసులు నమోదు చేసినట్లుగా డీజీపీ పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలు ముందుగా నిర్దేశించిన వేళలకు మించి నిర్వహించినందుకు 263 కేసులు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాక, పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు 644 కేసులు నమోదు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మాస్కులు పెట్టుకొని వారికి జరిమానాలు విధిస్తున్నామని అన్నారు. 


గతనెల 24 నుంచి ఈనెల 2 వరకు 16,430 మందికి జరిమానా విధించామని, తెలిపారు. జూన్ 20 నుంచి డిసెంబరు 23 వరకు 5,10,837 మందికి జరిమానా వేసినట్లు డీజీపీ నివేదికలో తెలిపారు. ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదని.. డీజీపీ తెలిపారు. జనం గుమిగూడకుండా పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కరోనా పరిస్థితులపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 7కి వాయిదా వేసింది.


పెరిగిన కేసుల తాకిడి
తెలంగాణలో గడిచిన రెండు, ముడు రోజులుగా 300కు పైగా కేసుల నమోదవుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 482 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 294, రంగారెడ్డి 55, మేడ్చల్ 48 చొప్పున అత్యధిక కేసులు నమోదు అయినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివిటీ రేటు కూడా పెరుగుతోంది.


గోవా వెళ్లొచ్చిన వారిలో భారీగా కేసులు
హైదరాబాద్‌కు చెందిన పలువురు కొత్త సంవత్సర వేడుకల కోసం గోవాకు వెళ్లొచ్చిన వారిలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 31వ తేదీ రాత్రి గోవాలోని బీచ్‌లలో వేలల్లో గుమిగూడి టూరిస్టులు వేడుకలు చేసుకున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండటంతో ఇక్కడి ప్రజలు కొత్త సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లారు. అలా వెళ్లి వచ్చిన వారిలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ యువకులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వేల సంఖ్యలో యువకులు గోవాకి వెళ్లారు. అలా వెళ్లి వచ్చినవారిలో ఇప్పటి వరకు 32 మందికి పాజిటివ్ అని తేలింది.


Also Read: Nellore Crime: ప్రేమతో కూర వండిన భార్య.. మొహం చిట్లించిన భర్త, ఆవేశంతో ఘోరానికి పాల్పడ్డ భార్య


Also Read: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు


Also Read: రూ. 50 చీప్ లిక్కరే కాదు.. రూ. 40కి బియ్యం కూడా .. అంతే కాదు .. ఇంకా చాలా ఉన్నాయ్... !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి