తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపట్నుంచి యాసంగికి సంబంధించి రైతుబంధు నిధులు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలో జమచేశామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమచేసినట్లు అవుతుందన్నారు. డిసెంబర్ 10 నాటికి ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు. ఈ సీజన్ లో 66.61 లక్షల మంది రైతులకు 152.91 లక్షల ఎకరాలకు రూ.7645.66  కోట్లు జమచేయనున్నామని మంత్రి తెలిపారు. దీనిలో 94 వేల మంది రైతులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులని పేర్కొన్నారు. ఎకరా నుంచి రెండు, మూడు, నాలుగు ఎకరాల లెక్కన గతంలో మాదిరిగా ఆరోహణ క్రమంలో నిధులు జమచేస్తామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలో అత్యుత్తమ 20 పథకాలలో ఒకటిగా... 2018 నవంబరులో రోమ్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్ఏవో గుర్తించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. 


Also Read: ఆరోగ్య రంగంలో తెలంగాణ టాప్.. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి హరీశ్ రావు అభినందనలు 


వారం పదిరోజుల్లో అందరీ ఖాతాల్లో నగదు


రైతులకు ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున సాయం చేసే రైతు బంధు పథకాన్ని డిసెంబర్ 28 నుంచి ప్రారంభించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 28వ తేదీ నుండి  రైతు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేస్తారు.  ప్రారంభించిన  వారం పదిరోజుల్లో గతం లో మాదిరి వరుస క్రమంలో అందరి ఖాతాల్లో జమ అవుతాయని  సీఎం కేసీఆర్ ప్రకటించారు. పథకాల అమలుపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం సమీక్షించారు. రైతు బంధు పథకం కోసం రైతులు ఎదురు చూస్తున్నందున వారికి వీలైనంత త్వరగా నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. 


Also Read: ఫస్ట్ కేరళ... తర్వాత తమిళనాడు, తెలంగాణ- ! 2019-20 హెల్త్ ఇండెక్స్ ర్యాంకులు ప్రకటించిన నీతిఆయోగ్ !


ప్రతీ రైతుకూ సాయం


రైతన్నకు ఆసరాగా నిలిచే రైతు బంధు చెల్లింపులు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 61 లక్షల 49 వేల మంది రైతులకు యాసంగి పంట సీజన్‌ కు సంబంధించి ఎకరాకు 5 వేల చొప్పున మొత్తం రూ.7,600 కోట్లు నేరుగా ఖాతాల్లో జమచేయనున్నారు. కోటి 52 లక్షల ఎకరాలకు డబ్బులు జమచేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి గుంట భూమికీ సాయమందాలని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా భూములను కొన్న రైతులు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం, రెవెన్యూ ఖాతా వివరాలను రైతుబంధు పోర్టల్‌లో ఏఈవోలు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత జూన్‌ నుంచి ఈ నెల 10 వరకూ కొత్తగా 20 వేల మంది భూములు కొన్నట్లు రెవిన్యూ రికార్డుల్లో తేలాయి. ఏఈవోలు ఈ వివరాలు నమోదు చేస్తేనే రైతుబంధు నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని అధికారులు వెల్లడించారు. సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. 


Also Read: వరంగల్ లో మరోసారి ఒమిక్రాన్ కలకలం... స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి