ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం మ‌రో ఘ‌న‌త‌ను సాధించింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఆరోగ్య సూచీలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాల్లో వైద్యారోగ్య రంగం  పురోగతిని నీతి ఆయోగ్ విశ్లేషించి నివేదిక రూపొందించింది. 2018-19లో  తెలంగాణ 4వ స్థానంలో ఉండగా, 2019-20లో మూడో స్థానానికి చేరింది. పెద్ద రాష్ట్రాల కేటగిరీలో కేర‌ళ మొదటి స్థానంలో, త‌మిళ‌నాడు రెండో స్థానంలో నిలువగా తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఆరోగ్యం రంగంలో పురోగమిస్తున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. అనేక అంశాల్లో తెలంగాణ మెరుగు పడిందని నీతి ఆయోగ్ వ్యాఖానించింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. 


మోస్ట్ ఇంప్రూవ్డ్ కేటగిరీలో తెలంగాణలో మొదటి స్థానం, ఆరోగ్య సూచిలో టాప్ - 3 లో నిలవడం పట్ల మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని, ఇందుకు ఇటీవల వరుసగా వస్తున్న ప్రశంసలే నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కి అభినందనలు తెలిపారు. 


వైద్యం పై తెలంగాణ పెద్ద మొత్తంలో ఖ‌ర్చుచేస్తుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇటీవల రాజ్యసభలో తెలిపింది. ప్రజా వైద్యం పై ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. ఒక్కో  వ్యక్తిపై చేస్తున్న త‌ల‌స‌రి ఖ‌ర్చు రూ. 1698 గా ఉంది. హిమాచ‌ల్ ప్రదేశ్, కేర‌ళ త‌ర్వాత తెలంగాణ నిలిచింది.


ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నవంబర్ 16 తేదీ నుంచి  డిసెంబర్ 13 వరకు "హెల్దీ అండ్ ఫిట్ నేషన్" క్యాంపెయిన్ నిర్వహించింది. మూడు కేటగిరీల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణకు రెండు దక్కాయి. తద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.  వెల్నెస్ యాక్టివిటీస్ లో దేశంలోనే మొదటి స్థానంలో,  నాన్ కమ్యూనికబుల్ డిసీసెస్ స్క్రీనింగ్ లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. యూనివర్సల్ హెల్త్ కవరేజి డే-2021 రోజున కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అవార్డులను బహూకరించింది.


Also Read: Best Health States : ఫస్ట్ కేరళ... తర్వాత తమిళనాడు, తెలంగాణ- ! 2019-20 హెల్త్ ఇండెక్స్ ర్యాంకులు ప్రకటించిన నీతిఆయోగ్ !


Also Read: Warangal News: వరంగల్ లో మరోసారి ఒమిక్రాన్ కలకలం... స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి