నకిలీ వస్తువులు తయారు చేసి... మార్కెట్లోకి చలామణి చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. బూస్ట్, సర్ఫ్ ఎక్సెల్, మస్కిటో రిపెల్లెంట్స్,  వివిధ కంపెనీల స్టిక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను వరంగల్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ వివరించారు. కతిరియా అవినాష్, వజ్రపు నరసింహ, రాజేష్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వీరి నుంచి మారుతీ వ్యాన్, 3- మొబైల్ ఫోన్‌లతో పాటు రూ.1,56,313 విలువైన నకిలీ ఉత్పత్తులు అంటే బూస్ట్ జాడీలు, సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్లు, దోమల నివారణ లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


నిందితులను విచారించగా.. హైదరాబాద్‌కు చెందిన వారితో కలిసి హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల నకిలీ ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయిస్తున్నారని చెప్పారు. వీటి వలన కొనుగోలుదారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని వివరించారు.  నకిలీ బూస్ట్ తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయన్నారు. నకిలీ మస్కిటో కాయిల్స్ వలన కూడా ప్రమాదముందన్నారు. 


నకిలీ ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా వివిధ కంపెనీలకు చెందిన వివిధ ఉత్పత్తులకు సంబంధించిన నకిలీ స్టిక్కర్లను తయారు చేసి, ఆ ఉత్పత్తులు నిజమైనవని ప్రజలను నమ్మించడం ద్వారా వారు కాపీరైట్ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ ముప్పును అరికట్టేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ బృందం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.


Also Read: Hyderabad: క్రెడిట్ కార్డు గురించి ఈ డీటైల్స్ గూగుల్‌లో అస్సలు వెతకొద్దు! అలా చేసినందుకు రూ.1.3 లక్షలు లూటీ


Also Read: PV Ramesh Parents : రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !


Also Read: Junior Artist Death: రైలు దిగేటప్పుడు తికమక.. జూనియర్ ఆర్టిస్ట్ మృతి, ఏం జరిగిందో చెప్పిన రైల్వే పోలీసులు


Also Read: Hyderabad: మొదటి భార్యతో కలిసి మాజీ భార్య వీడియో తీయించిన భర్త.. విడాకులైనా మోజు తగ్గక..!


Also Read: Nellore Crime: నెల్లూరులో చిన్నారి కిడ్నాప్... తిరుపతిలో అమ్మకానికి పెట్టిన ఆటోడ్రైవర్... 24 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు



Also Read: ఇద్దరు, ముగ్గురు సినిమా హీరోలపై కక్షతో పరిశ్రమను దెబ్బతిస్తారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి