నెల్లూరు జిల్లాలో ఓ కిడ్నాప్ కేసుని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. కిడ్నాపర్ తేరుకునేలోగా అతన్ని చుట్టుముట్టారు. తిరుపతిలో కిడ్నాపర్ నుం అరెస్ట్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చారు.
Also Read: Condom Use: లాక్‌డౌన్‌లో సెక్స్ మర్చిపోయారో ఏంటో!! ప్రపంచంలో అతిపెద్ద కండోమ్ కంపెనీకి నష్టాల సెగ!!
అసలేం జరిగిందంటే..?
నెల్లూరు నగరంలోని గుప్తా పార్క్ సెంటర్ లో ఆదివారం అర్ధరాత్రి చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. పొదలకూరు మండలం మహమ్మదాపురానికి చెందిన శ్రీనివాసులు దంపతులు ఇంటింటికి వెళ్లి పిండి వంటలు యాచించుకునేందుకు మూడు రోజుల క్రితం నెల్లూరుకు వచ్చారు. ఈ క్రమంలో రాత్రి గుప్తా పార్క్ వద్ద పాప అవ్వ, తాతలతో కలసి నిద్రిస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. చిన్నారి కిడ్నాప్ పై ఫిర్యాదు అందుకున్న సంతపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
Also Read: Case On PVP : డీకే అరుణ కుమార్తె ఇంటి గోడను కూలగొట్టించిన వైఎస్ఆర్‌సీపీ నేత పీవీపీ .. కేసు నమోదు !
Also Read: AP PRC Agitation : పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !
24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు
చిన్నారి అవ్వ, తాతల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా కేసు ఛేదించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి గూడూరుకి చెందిన ఆటో డ్రైవర్ మల్లి చెంచయ్యగా గుర్తించారు. సీసీ టీవీ ఆధారంగా కిడ్నాపర్ ఆ పసిబిడ్డను తిరుపతి తరలించినట్టు గుర్తించారు. తిరుపతిలో ఆ బిడ్డను అమ్మడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరుకి తరలించారు. పసిబిడ్డను క్షేమంగా అవ్వ తాతలకు అప్పగించారు. కిడ్నాప్ జరిగిన 24 గంటల్లోగా పోలీసులు ఈ కేసు ఛేదించారు.
Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...
Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి